TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అనుపమ్‌గారూ పాకిస్తాన్‌కి రండి- 'నేను రానులేండి'

Published on: Wed Feb 3, 2016 3:23PM

 

ప్రసిద్ధ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ వీసా సీరియల్‌ ఇంకా సా…గుతోంది. ఈ నెల కరాచీలో జరగనున్న ఒక సమావేశానికి అనుపమ్‌ ఖేర్‌ వెళ్లేందుకు సిద్ధపడగా ఆ దేశం వీసా ఇవ్వకుండా తాత్సారం చేసిన సంగతి తెలిసింది. పాకిస్తాన్‌ కావాలనే తన వీసా గురించి జాప్యం చేస్తోంది అనుపమ్‌ ఖేర్‌ ఆరోపిస్తుండగా, తమకి అసలు ఆయన వీసా దరఖాస్తే అందలేదని పాకిస్తాన్ అంటోంది. ఈ విషయాన్ని అనుపమ్‌ ఖేర్‌ ఒక వివాదం కిందకి మార్చేయడంతో పాకిస్తాన్‌ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.

 

భారతదేశంలోని పాకిస్తాన్‌ హైకమిషనర్‌ అబ్దుల్‌ బాసిత్‌ అనుపమ్‌కి ఫోన్‌ చేసి తమ దేశానికి రమ్మని స్వయంగా ఆహ్వానించారు. అయితే అదను చూసుకున్న అనుపమ్‌ తనకు ఇప్పడు తీరిక లేదు ‘నో థాంక్స్‌’ అనేశారు. పైగా తనకు పాకిస్తాన్ వీసాను నిరాకరించడం ఇది మొదటిసారి కాదనీ… కశ్మీరీ పండిట్ల పక్షానా, ప్రధానమంత్రి మోదీ పక్షాన మాట్లాడుతున్నందుకే ఆ దేశం తన పట్ల వివక్ష చూపుతోందని మళ్లీ విరుచుకుపడ్డారు అనుపమ్‌! తమ దేశానికి రమ్మని పిలిచినా రాకపోగా పదేపదే తమని దుమ్మెత్తి పోస్తున్న అనుపమ్‌ని చూసి పాకిస్తాన్‌ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.