TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆందోళనలకు సిద్దమవుతున్న పారిశ్రామిక వేత్తలు

Published on: Wed Aug 22, 2012 10:25AM

రాష్ట్రంలో గాడాంధకారం రాజ్యమేలుతుంది.వర్షాభావ పరిస్థితుల్లో హైడల్‌ విద్యుత్‌ కేంద్రాలు చతికిల బడ్డాయి. ఆపై గ్యాస్‌ కొరతతో విద్యుత్‌ ఉత్పత్తిపై కారుమబ్బులు కమ్ముకున్నాయి.దీంతో ధర్మల్‌ కేంద్రాలపై ఒత్తిడి పెరిగింది. డిమాండ్‌కు సరఫరాకు మద్య విద్యుత్‌ గ్యాప్‌ ఆగాధంలా పెరిగిపోయింది. జూరాల, శ్రీశైలం, నాగారదినసాగర్‌ జలాశయాలు నిండకుండా కోతలులేని కరెంటు సాధ్యపడదని ముఖ్యమంత్రి ఇందరమ్మ బాటలో చెప్పేశారు. కరీంనగర్‌జిల్లాలోని ఎన్‌టిపిసి ధర్మల్‌ కేంద్రంతో పాటు జూరాల జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి మరింత క్షీణించడంతో రాష్ట్రంలోని విద్యుత్‌ కొరత గణనీయంగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 7 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ రెండుగంటలు కూడా నాణ్యమైన విద్యుత్‌ అందించడం లేదని రైతులు అసంతృప్తిగా ఉన్నారు.

 

 రాష్ట్రంలో తాజాగా ఏర్పడిన విద్యుత్‌ సంక్షోభంతో శనివారం రాత్రినుండి హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక వాడలు అంధకారంలో ఉన్నాయి. దీంతో పరిశ్రమలకు సరఫరా చేస్తున్న విద్యుత్‌ పూర్తిగా స్తంభించిందని పరిశ్రమల అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే పరిస్థితి మంగళవారం వరకు ఉంటుందని ట్రాన్స్‌కో అధికారులు స్పష్టం చేశారు. అతి కష్టంమీద మంగళవారం నాటికి పారిశ్రామిక పార్కుల్లో తిరిగి విద్యుత్‌ సరఫరాచేయగలమని  ట్రాన్స్‌కో అధికారుల మాట. ఇప్పటికే పరిశ్రమల ఆర్డర్లు 50 శాతం పడిపోయాయని అలాగే 70 లక్షలమంది చిన్న పరిశ్రమల్లో పని చేసే కార్మికులు వారికుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని పాప్సియా అధ్యక్షుడు ఆవేదన వ్యక్తం చేశారు.

 

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తమను చర్చలకు ఆహ్వానించాలని, లేకుంటే కెజిబేసిన్‌ గ్యాసు సరఫరాను అడ్డుకుంటామని పరిశ్రమల యజమానులు చెబుతున్నారు.రాష్ట్రంలో సాధారణ విద్యుత్‌ వచ్చేవరకు కేంద్రమంత్రులు, ఎంపిలు, ఎమ్మేల్యేల, ఎమ్మేల్సీల ఇండ్లను ముట్టడిరచాలని పరిశ్రమల అసోసియేషన్లు తెలియచేసాయి. అంతేకాకుండా రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను ప్రోత్సహించకూడదని కూడా అసోసియేషన్లు అభిప్రాయపడుతున్నారు.