వందకు పైగా స్థానాలలో తెరాస!
Published on: Fri Feb 5, 2016 4:09PM

60, 70 కాదు… గ్రేటర్ ఎన్నికలలో తెరాస ఏకంగా వందకి పైగా స్థానాలలో ఆధిపత్యం కనబరుస్తున్న వార్తలు వస్తున్నాయి. దీంతో మేయర్ స్థానాన్ని సొంతంగానే కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఈ సంఖ్య కొంచెం అటూఇటూగా ఉన్నా కనీసం 90 సీట్లు తెరాసకి దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇక మజ్లిస్ 30కి పైగా సీట్లతో రెండో స్థానాన్ని చేరుకుంటుండగా, తెదెపా-బీజేపీ కూటమి మూడో స్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం సింగిల్ డిజిట్ తోనే సరిపెట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది.


