తానోడి కివీస్ ని ఫైనల్స్ కి పంపిన టీమిండియా...అదే కారణమా ?

 

ఈ ఏడాది వరల్డ్ కప్ భారత్ దే...ఈ వరల్డ్ కప్ సీజన్ మొదలయిన నాటి నుండే వినిపించిన మాట ఇది. దానికి ఎన్నో ఉదాహరణలు మరెన్నో పోలికలు. అందుకు తగ్గట్టే టీమిండియా కూడా తనదైన ప్రదర్శన కనబరిచింది. క్రికెట్ దిగ్గజం అయిన ఆసీస్ ను సైతం వెనక్కు నెట్టి పాయింట్ల పట్టికలో ముందుంది. ఇంగ్లాండ్ తో ఆట తప్ప మిగతా అన్ని మ్యాచ్లు గెలిచిన ఇండియా  ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవడం, అది కూడా గెలుస్తామని కాన్ఫిడెన్స్ వచ్చాక కాస్త ఇబ్బంది కారణమనే చెప్పాలి.

ఆటలు అన్నాక గెలుపోటములు సహజమే. టాపార్డర్ కుప్పకూలగా, జట్టు విజయ తీరాలకు చేర్చేందుకు జడేజా, ధోని చేసిన వీరోచిత పోరాటం వృథా అయ్యింది. దీంతో భారత అభిమానులు నైరాశ్యంలో కూరుకుపోయారు. మొదటి ఐదు పరుగులకే 3 వికెట్లు పడిపోగా మరో 19 రన్స్‌కే మరో వికెట్ పడింది. వారి స్కోరు 1,1,1,6.. ఆ దశలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్(32), హార్దిక్ పాండ్యా(32) వికెట్ పడకుండా కాసేపు అశలు రేకెత్తించారు. ఇద్దరూ అడపాదడపా సింగిల్స్ తీస్తూ కాపాడుకుంటూ వచ్చారు. 

అయితే, సాంట్నర్ వీరిద్దరి సహనాన్ని పరీక్షించి బుట్టలో వేసుకున్నాడు. ఈ దశలో గ్రేట్ ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోని, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చారు. వీరిద్దరు సింగిల్స్‌కే పరిమితం అవుతూ వచ్చారు. ఈ దశలో రన్ రేట్ 9కి చేరింది. అప్పుడే అసలు ఊహించని విధంగా జడేజా సిక్సుల మీదు సిక్సులు కొడుతూ న్యూజిలాండ్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. ధోని సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తుంటే జడేజా కివీస్ బౌలర్ల భరతం పట్టాడు. అయితే చివర్లో 77 పరుగులు చేసి జడేజా ఔటయ్యాడు. ధోని(50) కూడా రెండో సింగిల్‌కు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు.

 మరో 3 బంతులు మిగిలి ఉండగానే 221 పరుగుల వద్ద టీమిండియా ఆలౌట్ అయ్యింది.   ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమికి కారణాలేంటో విశ్లేషిస్తే  ముందుగా మాట్లడుకోవాల్సింది టాస్ గురించే. ఎందుకంటే నాకౌట్ మ్యాచ్‌ల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే టాస్ గెలవగానే విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓకవేళ కోహ్లి టాస్ గెలిచినా ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే వాడే. అల అముందు టాస్ గెలుచుకోవడం అనేది కీలకంగా మారింది. 

ఇక వర్షం కూడా ఓటమికి కీలకమగా మారింది మ్యాచ్ జరుగుతున్న మాంచెస్టర్‌లో వర్షం పడకుండా మ్యాచ్ మంగళవారమే మ్యాచ్ ముగిసి ఉంటే ఫలితం వేరీలా ఉండేదేమో. కానీ బ్యాడ్ లక్ వర్షం కారణంగా మ్యాచ్ బుధవారానికి వాయిదా పడింది. ఉదయాన్నే పిచ్ మీద పడిన వర్షం కారణంగా పేస్‌కు అనుకూలించే పరిస్థితులలో కివీస్ పేస్ బౌలర్లు చెలరేగిపోయారు. ఇక భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలడం కూడా మ్యాచ్ ఓటమికి మరో కారణం టాప్ ఆర్డర్ పేక మేడను తలపించింది. 

ఒకరి వెనక ఒకరు ఒకరి వెనక ఒకరు అలా వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా టాప్-3 బ్యాట్స్‌మెన్ ఒక్కో పరుగు చొప్పున చేసి అవుటయ్యారు. అప్పుడే భారత్ ఓడిన ఫీలింగ్ వచ్చినా ధోనీ ఏడో స్థానంలో దిగడం కూడా ఓటమికి ఓ రకంగా కారణం కావొచ్చు. దినేశ్ కార్తీక్ స్థానంలో ధోనీని ఐదోస్థానంలో బ్యాటింగ్‌కు పంపిస్తే ఫలితం మరోలా ఉండేదేమోనని వేస్లేషణలు వస్తున్నాయి. ఏదయితేనేమి మనం ఓడాము అంటే పోరాడినట్టే, ఈ పోరాటం ఇలాగే కొనసాగాలని వచ్చే ఏడాది అయినా మనవాళ్ళు ప్రపంచ కప్ కొట్టాలని కోరుకుందాం.