సీతమ్మ వాకిట్లో...స్పెషల్ గెస్ట్
Published on: Mon Dec 17, 2012 1:51PM
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో అభిమానులకు మహేష్ బాబు, వెంకటేష్ సడన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. సూపర్ స్టార్, విక్టరీ వెంకటేష్ లు ఉండగా ఆడియో ఫంక్షన్ కు గెస్ట్ లు ఎవరురారని అనుకున్నారందరు, కాని సడన్ గా ఇద్దరు గెస్ట్ లు అక్కడ ప్రత్యక్షమయ్యేసరికి వాతావరణం అంతా కోలాహలంగా మారింది. వారెవరో కాదు వెంకటేష్ కుమారుడు అర్జున్, మహేష్‌బాబు తనయుడు గౌతమ్ కృష్ణ.
అర్జున్, గౌతమ్ కృష్ణ లు నిన్న జరిగిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఫంక్షన్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఆడియో వేదిక పైకి మహేష్ బాబు తన కుమారుడు గౌతమ్ కృష్ణ తో, వెంకటేష్ తన తనయుడు అర్జున్ తో కలిసి వచ్చారు. అప్పటి వరకు సూపర్ స్టార మీద ఫోకస్ చేసిన కెమెరాలు అన్ని ఈ చిన్ని సూపర్ స్టార్ల ఫోటోలు తీయడంలో నిమగ్నమైపోయాయి. తొలి ఆడియో సీడీని వెంకటేష్ కుమారుడు అర్జున్ ఆవిష్కరించి మహేష్‌బాబు తనయుడు గౌతమ్ కృష్ణకి అందజేశారు.



