TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పాదయాత్రలో 8వ సెంచరి పూర్తి చేసిన బాబు

Published on: Thu Nov 22, 2012 9:55AM

 

 

తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాదయాత్రలో మరో మైలు రాయి దాటారు. పాదయాత్ర 800 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఇప్పటివరకు మొత్తం ఐదు జిల్లాల్లోని 327 గ్రామాల గుండా చంద్రబాబు పాదయాత్ర కొనసాగింది. యాభై రోజులు పూర్తి చేసుకున్న బాబు మరుసటి రోజే దూరంలో ఎనిమిది సెంచరీలు పూర్తి చేశారు. మెదక్ జిల్లా ఆంధోల్ నియోజకవర్గంలోని మునిపల్లి గ్రామంలోకి అడుగుపెట్టడంతో యాత్ర ఎనిమిది వందల కిలోమీటర్లు పూర్తయింది. యాభై ఒకటి రోజుల్లో ఆయన మొత్తం 20 నియోజకవర్గాలు పర్యటించినట్లయింది.



పాదయాత్ర తొలిరోజు నుంచి చంద్రబాబు రైతులు, కుల వృత్తుల వారితో ఎక్కువగా మమేకం అవుతున్నారు. మధ్య మధ్యలో పలు రకాల ప్రజలతో మాట్లాడుతున్నారు. అప్పుడపుడు స్కూళ్లు, కాలేజీలు సందర్శిస్తూ పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. వారికి స్ఫూర్తి పాఠాలు బోధిస్తున్నారు.