Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అంబటి నిన్ను చంపేస్తాం
posted on: Mar 29, 2013 5:29PM
.jpg)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబుకు ఈ మధ్య విపరీతంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయట.“సత్తెనపల్లిలో అడుగుపెట్టావంటే నిన్ను చంపేస్తాం” అని అంబటి కి రోజు ఫోన్ లు వస్తున్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక చివరికి గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇక్కడ అసలు విషయం ఏంటంటే అంబటికి జిల్లాలో తనకంటూ ఓ నియోజకవర్గం లేదు.ఆయన సత్తెనపల్లి నుండి పోటీచేయాలని భావిస్తున్నారట. ఈ మేరకు ఇక్కడ టికెట్ తనకే ఇవ్వాలని అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టారట. అయితే స్థానికేతరులకు టికెట్ ఇస్తే ఊరుకునేదిలేదని సత్తెనపల్లి వాసులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారట. ఈ నేపథ్యంలో పార్టీలో ఆయనకు పోటీగా ఉన్నవారే ఈ కాల్స్ చేశారని భావిస్తున్నారు. వరసగా పది రోజుల నుండి ఇలా బెదిరింపు టెలిఫోన్ కాల్స్ రావడం పట్ల అంబటి తట్టుకోలేక ఫిర్యాదు చేశారట.



.jpg)


