ముఖంపై ముడతలను నివారించాలంటే

మహిళలకు ఉండే కారణాలు ఏమైన కావచ్చు. కాని మహిళల్లో ఏర్పడే అధిక పొట్ట, విటమిన్స్ లోపం, విపరీతమైన ఒత్తిడికి గురికావడం...ఇలాంటి వివిధ కారణాల వల్ల అతి చిన్న వయస్సులోనే ముఖంపై మడతలు వస్తాయి.ముఖం మీద వచ్చే మడతలు ముఖ కాంతిని దూరం చేయడమే కాకుండా వయసు పైబడిన వారిలా కనిపించేలా చేస్తాయి. దాంతో చాల మంది మహిళలు బయటికి రావడానికి, ఎక్కడికైనా వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంటారు. అసలు ముఖం పై వచ్చే ఈ మడతలని నివారించడానికి మనం ఏం చేస్తే బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

* అరటి పండు గుజ్జును ముఖానికి రాసుకొని అది పూర్తిగా ఆరిన తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. దాంతో మంచి ఫలితం ఉంటుంది.

* రాత్రి పూట పడుకునే ముందు బంగాళాదుంప గుజ్జును ముఖానికి రాసుకోవాలి. అది పూర్తిగా ఎండిన తరువాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి . ఇలా రెండు వారాల క్రమం తప్పకుండా చేస్తే ముఖంలో మార్పు వస్తుంది.

* తాజాగా ఉండే బొప్పాయి పండు గుజ్జును తీసుకుని ఐదు నిమిషాల పాటు ముఖానికి రాసుకోవాలి. ముఖమంతా శుభ్రంగా రాసుకొని పదిహేను నిమిషాల పాటు ఉంచి ఆ తరువాత చల్లని నీటితో కడుక్కుంటే మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ ముఖానికి రాసుకోవడం ఇష్టం లేకపోతే బొప్పాయిని తినొచ్చు. అలా తినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

* కోడిగుడ్డులో ఉండే తెల్లసొనని తీసుకొని అందులో నిమ్మరసం కలపి ఆ మిశ్రమాన్ని కళ్లకు అంటకుండా ముఖానికి రాసుకోవాలి. రాసుకున్న తరువాత పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉంచుకొని ఆ తరువాత చల్లని నీటితో కడుక్కుంటే ముడతలు మాయమవుతాయి.

* ఒకవేళ ముఖంలో ముడతలు ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం క్యాబేజీ జ్యూస్ తీసుకుని దానికి టీ స్పూన్ తేనె జత చేసి ముఖానికి రెగ్యులర్‌గా రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.