వర్షాకాలంలో మీ చర్మానికి చిక్కుల్లేకుండా..!

 

వర్షాకాలం వచ్చేసింది..చిటపట చినుకుల్లో ఫ్రెండ్స్‌తో అలా లాంగ్ డ్రైవ్‌కు వెళ్లాలనో..సరదాగా ఆడిపాడాలనో చాలా మందికి ఉంటుంది. ఎండాకాలంలో వేడిని భరించలేక చల్లదనాన్ని కోరుకోవడం మనిషికి అత్యంత సహజం..అయితే ఆ ఆనందాన్ని ఆవిరి చేయడానికి అనేక చర్మ సమస్యలు రెడీగా ఉంటాయి..కామన్‌గా ఎండాకాలంలో చెమట ఎక్కువ పోస్తుంది కాబట్టి స్కిన్‌ని చాలా జాగ్రత్తగా మెయింటెన్ చేసి..వర్షాకాలంలో కాస్త బద్దకిస్తుంటారు..కానీ ఎండాకాలంతో పోలీస్తే వానల్లోనే చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి..ఈ కాలంలో చర్మం ఎక్కువగా పొడిబారడం, యాక్నె, పింపుల్స్, ఇతర చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా బాధించే అవకాశముంది..కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకుంటే..వర్షాకాలాన్ని మీరు అనుకున్న విధంగా ఎంజాయ్ చేస్తూనే అందాన్ని కాపాడుకోవచ్చు. వీటి కోసం బ్యూటీపార్లర్లకో..హెల్త్‌కేర్ సెంటర్లకో పరుగులు పెట్టక్కర్లేదు. మన వంటింట్లో..పెరట్లో దొరికే వస్తువులతోనే మెరిసిపోవచ్చు.

* తేయాకు నూనె, కొబ్బరి నూనెల మిశ్రమం చర్మానికి ఎంతో మేలు చేస్తుంది..చిన్న చిన్న పగుళ్లు, దద్దుర్లు, మొటిమల వంటి సమస్యలను దూరం చేయడంలో ఇవి మంచి ఔషదంలా పనిచేస్తాయి.

* వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలకు అద్భుతమైన విరుగుడు కలబంద. చర్మంలోని రక్తకణాలను శుభ్రం చేసే శక్తి కలబందకు ఉంది. అందువల్ల బయటకు వెళ్లినప్పుడు కలబంద జెల్‌ను రాసుకోవడం అన్ని విధాల మంచిది.

తేనే, ఆలివ్ ఆయిల్, నిమ్మరసాలను కలిపి ముఖానికి మాస్క్‌లా పెట్టుకుంటే పొడి చర్మంతో బాధపడే వారికి మంచి ఫలితం కనిపిస్తుంది.

* పుచ్చకాయ రసంలో మిల్క్‌పౌడర్‌ను కలుపుకుని రాసుకుంటే చర్మం మీదున్న మచ్చలు వదిలిపోతాయి.

* వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల మనలో చాలా మంది నీళ్లు సరిగా తాగరు. కానీ ఈ కాలంలోనూ ఎంత ఎక్కువ నీళ్లు తాగితే అంత మంచిది. దీని వల్ల చర్మం ఫ్రెష్‌గా, అందంగా కనిపిస్తుంది.