శ్రీ వేంకటేశ్వర వనాభివృద్ధి స్కీం
Sri Venkateswara Vanabhivruddhi Scheme
విజ్ఞప్తి
చెట్లు నాటువారు భగవత్సేవకులే అవుతారు. రాబోయే తరాల వారి ఆదరాభిమానాలు పొందేందుకు చెట్లు పెంచడం ఒక చక్కని మార్గం.
వివరాలు
శ్రీ వేంకటేశ్వరుడు మానవజాతికి అందించిన చక్కని కానుక తిరుమల కొండమీద ఉన్న పవిత్ర వనాలు. ఈ ప్రాంతంలో పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు, ఆ వనాల రక్షణ, నిర్వహణకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన పథకం శ్రీ వేంకటేశ్వర వనాభివృద్ధి పథకం. టిటిడి పర్యవేక్షణలో అటవీ విభాగం 15 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ పథకంలో భాగస్వాములు కావడానికి ఈ పథకం ఒక చక్కని అవకాశం. శ్రీ వేంకటేశ్వర వనాభివృద్ధి పథకంలోని అంశాలు చూడండి.
విరాళాల మొత్తం
ఈ పథకం కింద కనీస మొత్తం వెయ్యి రూపాయలు, వెయ్యి రూపాయలకు తక్కువ మొత్తం అయిన పక్షంలో దాటకు ఎటువంటి సమాచారం అందించకుండా శ్రీవారి హుండీలో జమచేస్తారు. విరాళాల మొత్తాన్ని జాతీయ బ్యాంకులో జమచేసి, దానిపై వచ్చే వడ్డీని పథకం నిర్వహణకు వినియోగిస్తారు.
విరాళాలను ఏదైనా జాతీయ బ్యాంకులో చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్టు రూపంలో ఎగ్జిక్యూటివ్ అధికారి, శ్రీ వేంకటేశ్వర వనాభివృద్ధి పథకం, టిటిడి, తిరుపతి పేరుమీద తీసి ఎగ్జిక్యూటివ్ అధికారి, శ్రీ వేంకటేశ్వర వనాభివృద్ధి పథకం, టిటిడి, తిరుపతి-517 501 అనే చిరునామాకు పంపాలి.
మరిన్ని వివరాల కోసం సంప్రదించండి: 0877 – 2277777, 2233333
వ్యక్తులు, సంస్థలు, కంపెనీలు విరాళాలు అందించవచ్చు. ఇలా విరాళాలు అందించినవారు పథకంలో నిర్దేశించిన సౌకర్యాలు పొందడానికి మాత్రమే అర్హులు.
ఈ పథకానికి ఆదాయపు పన్ను చట్టం ప్రకారం పన్ను రాయితీ వర్తించదు.
శ్రీ వేంకటేశ్వర వనాభివృద్ధి పథకానికి లక్ష రూపాయల నుండి ఐదు లక్షల రూపాయల విరాళం ఇచ్చిన దాతలకు వర్తించే సౌకర్యాలు పవిత్ర తిరుమల కొండలమీద దాత పేరు మీద 50 మొక్కలు నాటుతారు. ఈ మొక్కలను రెండు సంవత్సరాలపాటు నిర్వహిస్తారు.