Home »Schemes & Trusts » Sri Venkateswara Balamandir Trust
?>

శ్రీ వేంకటేశ్వర బాలమందిర్ ట్రస్ట్

 

Sri Venkateswara Balamandir Trust

 

వివరాలు

''మానవ సేవే మాధవ సేవ'' అనే సూక్తిని దృష్టిలో ఉంచుకుని ఆ లక్ష్యం సాధించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అనేక సామాజిక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా అనాథలకు చేయూత ఇచ్చేందుకు టి.టి.డి. 1943లో శ్రీ వేంకటేశ్వర బాలమందిర్ ట్రస్ట్ను ప్రారంభించింది.

 

తల్లిదండ్రులు లేని బాలబాలికలు, లేదా తల్లిదండ్రుల్లో ఒకరు మరణించి రెండోవారు పోషించలేని స్థితిలో ఉన్నవారి పిల్లలకు ఈ సంస్థలో ఆశ్రయం దొరుకుతుంది. ఇక్కడ చేరిన పిల్లలకు మొదటి తరగతి నుంచి విద్య, వసతి, భోజనం తదితర కనీస అవసరాలు అన్నిటినీ సంస్థ తీరుస్తుంది. టి.టి.డి. నిర్వహిస్తున్న విద్యా సంస్థల్లో గ్రాడ్యుయేషన్ వరకూ విద్య బోధిస్తారు. తెలివైన విద్యార్థులకు ఎం.సెట్కోచింగ్ ఇప్పిస్తారు. బాలమందిర్లో చేరిన విద్యార్థులు వారి కాళ్ళమీద వారు నిలబడేలా చేయడం సంస్థ లక్ష్యం.

 

కింద ఇచ్చిన లక్ష్యాలను నెరవేర్చడం కోసం టి.టి.డి. విడిగా ఇంకో ట్రస్టును ఏర్పాటు చేసింది.

 

అనాథ బాలబాలికల కోసం శరణాలయం నిర్వహించడం

అనాథ బాలబాలికలలకు ఉచిత వసతి సమకూర్చడం

తెలివైన విద్యార్థులకు ఎంబిబిఎస్, ఇంజనీరింగ్ లాంటి కోర్సుల్లో పి.జి. స్థాయి వరకూ చదివించడం

 

విరాళం మొత్తం ఈ పథకం కింద కనీస మొత్తం వెయ్యి రూపాయలు. వెయ్యి కంటే తక్కువ మొత్తం అయిన పక్షంలో దాతకు ఎలాంటి సమాచారం అందించకుండా శ్రీవారి హుండీలో జమచేస్తారు. విరాళాల మొత్తాన్ని జాతీయ బ్యాంకులో జమచేసి దానిపై వచ్చే వడ్డీని పథకం నిర్వహణకు వినియోగిస్తారు.

 

విరాళాలను ఏదైనా జాతీయ బ్యాంకులో చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్టు రూపంలో ఎగ్జిక్యూటివ్ అధికారి, శ్రీ వేంకటేశ్వర బాలమందిర్ ట్రస్ట్, టి.టి.డి, తిరుపతి పేరు మీద తీసి, చీఫ్ ఎకౌంట్స్ ఆఫీసర్, టి.టి.డి. తిరుపతి - 517 501 అనే చిరునామాకు పంపాలి.

 

మరిన్ని వివరాల కోసం సంప్రదించండి..0877 – 2277777, 2233333

 

ఈ పథకానికి ఆదాయపు పన్ను చట్టం ప్రకారం సెక్షన్ 80(జి)పన్ను రాయితీ వర్తిస్తుంది.