Home »Schemes & Trusts » Facilities for Tirumala Donors
?>

తిరుపతిలో దాతలకు వర్తించే సౌకర్యాలు

Facilities for Tirumala Donors

తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుమల శ్రీ వేంకటేశ్వరునికి పెద్దమొత్తంలో దానాలు చేసిన దాతలకు కొన్ని సౌకర్యాలు కల్పించింది. ఆవిధంగా దాతలకు వర్తించే సౌకర్యాలు చూడండి...

పదిలక్షలు, అంతకంటే ఎక్కువ విరాళం ఇచ్చిన దాతలకు వర్తించే సౌకర్యాలు

దాత, వారి కుటుంబసభ్యులకు (ఐదుగురికి మించకుండా) 500 రూపాయల ఖరీదు చేసే విఐపి సూట్ లో సంవత్సరంలో మూడురోజుల ఉచిత వసతి లేదా కాలానుగుణంగా పైన చెప్పిన ఖరీదులో టి.టి.డి. చేసే మార్పుచేర్పుల ఆధారంగా ఇచ్చే ఉచిత వసతి (అందుబాటులో ఉండే వసతిసౌకర్యం ఆధారంగా)

దాత, వారి కుటుంబసభ్యులకు (ఐదుగురికి మించకుండా) సంవత్సరంలో మూడురోజులు అర్చన అనంతర దర్శనం (అందుబాటులో ఉండే దర్శన సౌకర్యం ఆధారంగా)

సంవత్సరంలో ఒకసారి దాత తిరుమల సందర్శించిన సమయంలో ఇరవై చిన్న లడ్డూలను స్వామివారి ప్రసాదంగా అందిస్తారు.

సంవత్సరంలో ఒకసారి దాత తిరుమల సందర్శించిన సమయంలో ఒక ఉత్తరీయం, రవిక బహుమతిగా అందిస్తారు.

మొట్టమొదటిసారి దాత తిరుమలను సందర్శించిన సమయంలో శ్రీవారు, పద్మావతీదేవిల చిత్రాలున్న ఐదు గ్రాముల బంగారపు డాలర్, గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ మెడల్ అందిస్తారు.

పైన చెప్పిన సౌకర్యాలను వ్యక్తి జీవితకాలంలో, సంస్థలు, కంపెనీలు సంయుక్త దాతల విషయంలో ఇరవై సంవత్సరాలకు పొడిగించే అవకాశం ఉంది.

ఆదాయపుపన్ను చట్టానికి అనుగుణంగా పన్ను రాయితీ వర్తిస్తుంది.

సంవత్సరంలో ఒకసారి దాత తిరుమల సందర్శించిన సమయంలో పది మహా ప్రసాదం పాకెట్లను అందిస్తారు.

ఐదులక్షల నుండి పదిలక్షల లోపు విరాళం ఇచ్చిన దాతలకు వర్తించే సౌకర్యాలు

దాత, వారి కుటుంబసభ్యులకు (ఐదుగురికి మించకుండా) 500 రూపాయల ఖరీదు చేసే విఐపి సూట్ లో సంవత్సరంలో మూడురోజుల ఎఆర్పి కౌంటర్ వద్ద ఉచిత వసతి లేదా విఐపి వసతికి తగిన ఖరీదు చెల్లిస్తే, ఇచ్చే ఉచిత వసతి (అందుబాటులో ఉండే వసతిసౌకర్యం ఆధారంగా)

దాత, వారి కుటుంబసభ్యులకు (ఐదుగురికి మించకుండా) సంవత్సరంలో మూడురోజులు సెల్లార్ దర్శనం (అందుబాటులో ఉండే దర్శన సౌకర్యం ఆధారంగా)

సంవత్సరంలో ఒకసారి దాత తిరుమల సందర్శించిన సమయంలో పది చిన్న లడ్డూలను స్వామివారి ప్రసాదంగా అందిస్తారు. సంవత్సరంలో ఒకసారి దాత తిరుమల సందర్శించిన సమయంలో ఒక ఉత్తరీయం, రవిక బహుమతిగా అందిస్తారు.

మొట్టమొదటిసారి దాత తిరుమలను సందర్శించిన సమయంలో శ్రీవారు, పద్మావతీదేవిల చిత్రాలున్న గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ మెడల్ అందిస్తారు.

పైన చెప్పిన సౌకర్యాలను వ్యక్తి జీవితకాలంలో, సంస్థలు, కంపెనీలు సంయుక్త దాతల విషయంలో ఇరవై సంవత్సరాలకు పొడిగించే అవకాశం ఉంది.

ఆదాయపుపన్ను చట్టానికి అనుగుణంగా పన్ను రాయితీ వర్తిస్తుంది.

సంవత్సరంలో ఒకసారి దాత తిరుమల సందర్శించిన సమయంలో ఐదు మహా ప్రసాదం పాకెట్లను అందిస్తారు.

లక్ష నుండి ఐదు లక్షల లోపు విరాళం ఇచ్చిన దాతలకు వర్తించే సౌకర్యాలు

దాత, వారి కుటుంబసభ్యులకు (ఐదుగురికి మించకుండా) 500 రూపాయల ఖరీదు చేసే విఐపి సూట్ లో సంవత్సరంలో ఒకరోజు ఎఆర్పి కౌంటర్ వద్ద ఉచిత వసతి లేదా విఐపి వసతికి తగిన ఖరీదు చెల్లిస్తే, ఇచ్చే ఉచిత వసతి (అందుబాటులో ఉండే వసతిసౌకర్యం ఆధారంగా)

దాత, వారి కుటుంబసభ్యులకు (ఐదుగురికి మించకుండా) సంవత్సరంలో ఒకరోజు సెల్లార్ దర్శనం (అందుబాటులో ఉండే దర్శన సౌకర్యం ఆధారంగా)

సంవత్సరంలో ఒకసారి దాత తిరుమల సందర్శించిన సమయంలో ఆరు చిన్న లడ్డూలను స్వామివారి ప్రసాదంగా అందిస్తారు.