శ్రీ వేంకటేశ్వర నిత్యాన్నదాన ట్రస్ట్
Sri Venkateswara Nityannadana Trust
వివరాలు
తిరుమలకు వచ్చే యాత్రికులకు ఉచితంగా భోజనం అందించడం శ్రీ వేంకటేశ్వర నిత్యాన్నదాన పథకం లక్ష్యం. 1985 ఏప్రిల్ వ తేదీ న చిన్న తరహాలో సుమారు రెండు వేలమందికి ప్రతిరోజూ భోజనం సమకూర్చేవిధంగా ఈ పథకం ప్రారంభమైంది. ఇప్పుడు ప్రతిరోజూ సుమారు 30 వేలమందికి భోజనం సమకూర్చేవిధంగా ఈ పథకం ద్వారా ప్రతిరోజూ భోజనం అందిస్తున్నారు. పండుగలు, పర్వదినాల్లో ఈ సంఖ్య 50 వేలకు చేరుతుంది.
వైకుంఠం కాంప్లెక్స్ లో స్వామివారి దర్శనం కోసం వేచి ఉండే భక్తులకు ఉచితంగా అల్పాహారం, ఉదయం, రాత్రి భోజనం అందిస్తున్నారు. సుమారు 15 వేలమందికి ఇలా ఉచిత భోజనం అందిస్తుండగా, టి.టి.డి. నిర్వహిస్తున్న సిమ్స్ తదితర ఆసుపత్రుల్లో చికిత్స పొందే సుమారు రెండువేలమంది రోగులకు కూడా నిత్యం భోజనం అందిస్తున్నారు.
విరాళం మొత్తం
ఈ పథకం కింద కనీస మొత్తం వెయ్యి రూపాయలు, వెయ్యి రూపాయలకు తక్కువ మొత్తం అయిన పక్షంలో దాటకు ఎటువంటి సమాచారం అందించకుండా శ్రీవారి హుండీలో జమచేస్తారు. విరాళాల మొత్తాన్ని జాతీయ బ్యాంకులో జమచేసి, దానిపై వచ్చే వడ్డీని పథకం నిర్వహణకు వినియోగిస్తారు.
విరాళాలను ఏదైనా జాతీయ బ్యాంకులో చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్టు రూపంలో ఎగ్జిక్యూటివ్ అధికారి, శ్రీ వేంకటేశ్వర నిత్య అన్నదానం ట్రస్టు, టి.టి.డి. తిరుపతి - 517 501 అనే చిరునామాకు పంపాలి.
మరిన్ని వివరాల కోసం సంప్రదించండి..0877 – 2277777, 2233333
ఈ పథకానికి ఆదాయపు పన్ను చట్టం ప్రకారం సెక్షన్ 80(జి)పన్ను రాయితీ వర్తిస్తుంది.




