Home »Schemes & Trusts » Guidelines for Donors
?>

దాతలకు సూచనలు

Guidelines for Donors

 

దాతలు ఏ పథకం కింద దానం చేస్తున్నారో మొదట చూసుకోవాలి. తర్వాత అనుకున్న మొత్తాన్ని డిమాండ్ డ్రాఫ్టు / ఇంటర్నేషనల్ మనీ ఆర్డర్ రూపంలో దాతలు తమ విరాళాన్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, పథకం పేరు, తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి పేరుమీద చెల్లుబాటు అయ్యేలా పథకం లేదా ట్రస్టుకు సంబంధిత అధికారి, తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి - 517 501 చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ అనే చిరునామాకు పంపాలి.

 

దాతలు పథకం లేదా ట్రస్టు పేరు స్పష్టంగా తెల్పుతూ తమ పాస్ పోర్టు సైజు ఫోటో జటచేసిన కవరింగ్ లెటరును పంపాలి.

 

దాతలు తమ పూర్తి చిరునామా, ఫోన్ నంబరు, ఫాక్స్ నంబరు, ఇ-మెయిల్, మొబైల్ నంబరు ఇవ్వాలి.

విరాళం అందిన వెంటనే దాతలకు ఏక్నాలెడ్జ్మెంటు పంపుతాం.

ఏదైనా సహాయం కోసం దాతలు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అధికారి, దాతల విభాగం, టి.టి.డి.ని సంప్రదించవచ్చు.

ఏ జాతీయ బ్యాంకులో అయినా తమ విరాళాల డి.డి.ని తిరుమల దాతల విభాగం, టి.టి.డి. తిరుమల లేదా దాతల విభాగం టి.టి.డి. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, తిరుపతిలో అందించి రసీదు పొందవచ్చు.

పాస్ బుక్ అందించిన తర్వాత నుంచీ మాత్రమే దాతలకు టి.టి.డి. అందించే సౌకర్యాలు వర్తిస్తాయి.

ఎవరైనా దాత విరాళం అందిస్తూ వసతి, దర్శనం తదితర సౌకర్యాలు అదేరోజు పొందగోరిన పక్షంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, దాతల విభాగం, టి.టి.డి, తిరుమల లేదా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రిసెప్షన్-1 లేదా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రిసెప్షన్-2 లేదా ఆఫీసర్ ఆన్ డ్యూటీ, టి.టి.డి., తిరుమలను సంప్రదించవచ్చు.

బంగారం, వెండి, వస్తువులు, సామగ్రి లాంటివి విరాళంగా అందించినా కూడా టి.టి.డి.స్వీకరిస్తుంది. ఈవిధంగా ఐదు లక్షలకు మించి విరాళాన్ని అందించిన దాతలకు, వారు అందించిన వస్తు సామగ్రికి సమాన విలువైన నగదును అందించిన దాతలకు వర్తించే సౌకర్యాలన్నీ వర్తిస్తాయి. ఇటువంటి సౌకర్యం పొందగోరే దాతలు ముందుగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టి.టి.డి.ని సంప్రదించవచ్చు.