శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్
Sri Venkateswara Pranadana Trust
వివరాలు
గుండె, మూత్రపిండాల సంబంధిత వ్యాదులతోపాటు కాన్సర్ వంటి ప్రాణాంతక ఖరీదైన చికిత్స అవసరమయ్యే వ్యాధుల బారినపడినవారికి ఉచిత చికిత్స అందించేందుకు శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ఏర్పాటైంది.
హోమోఫీలియా, ధలస్సేమియా, కాన్సర్ లాంటి వ్యాధుల చికిత్స పై పరిశోధన చికిత్సలో వస్తున్నా ఆధునిక పోకడల అధ్యయనాలను ప్రోత్సహిస్తుంది. ఫిజియోథెరపీ, బ్లడ్ బ్యాంక్, ఇంప్లాంట్స్ వంటి సౌకర్యాలను పేదలకు ఉచితంగా ట్రస్ట్ అందిస్తుంది.
ఈ పథకం కుల, మత, వర్గ విచక్షణ లేకుండా పేదలందరికీ వర్తిస్తుంది. టి టి డి నిర్వహిస్తున్న సిమ్స్, ఎస్.వి.వి.ఆర్. ప్రసూతి వైద్యశాల, బి.ఐ.ఆర్.ఆర్.డి. సహా అన్ని ఆసుపత్రుల్లో చికిత్స లభిస్తుంది.
ట్రస్టు స్వయంసమృద్ధి సాధించేందుకు గాను ట్రస్టుకు అందిన ప్రతి విరాళానికి సమాన మొత్తం టి.టి.డి. అందిస్తుంది.
విరాళం మొత్తం
ఈ పథకం కింద కనీస మొత్తం వెయ్యి రూపాయలు, వెయ్యి రూపాయలకు తక్కువ మొత్తం అయిన పక్షంలో దాతకు ఎటువంటి సమాచారం అందించకుండా శ్రీవారి హుండీలో జమచేస్తాం. విరాళాల మొత్తాన్ని జాతీయ బ్యాంకులో జమచేసి, దానిపై వచ్చే వడ్డీని పథకం నిర్వహణకు వినియోగిస్తాం.
విరాళాలను ఏదైనా జాతీయ బ్యాంకులో చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్టు రూపంలో ఎగ్జిక్యూటివ్ అధికారి, శ్రీ ఎస్.వి. ప్రాణదాన ట్రస్ట్, టి.టి.డి. తిరుపతి పేరు మీద తీసి, చీఫ్ ఎకౌంట్స్ అధికారి, తిరుపతి - 517 501 అనే చిరునామాకు పంపాలి.
మరిన్ని వివరాల కోసం సంప్రదించండి.. 0877 – 2277777, 2233333
ఈ పథకానికి ఆదాయపు పన్ను చట్టం ప్రకారం సెక్షన్ 80(జి)పన్ను రాయితీ వర్తిస్తుంది.
విలువైన ప్రాణాలను కాపాడండి - ప్రాణదాన ట్రస్టుకు విరివిగా విరాళాలను అందించండి.




