Home »Schemes & Trusts » Balaji Institute of Surgery Research rehabilitation for disabled Trust
?>

బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్, రీహాబిలిటేషన్ ఫర్ డిజేబుల్డ్ ట్రస్ట్ (బి.ఐ.ఆర్.ఆర్.డి.)

Balaji Institute of Surgery Research rehabilitation for disabled Trust (B.I.R.R.D.)

 

వెన్నెముక గాయాలు, పోలియో, మైలిటిస్, సెరిబ్రల్ పాల్సీ తదితర వ్యాధుల బారిన పడిన రోగులకు బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్, రీహాబిలిటేషన్ ట్రస్ట్ (బి.ఐ.ఆర్.ఆర్.డి.) Balaji Institute of Surgery Research rehabilitation for disabled Trust (B.I.R.R.D.) ద్వారా చికిత్స చేయడానికి ఈ వైద్య సంస్థ ఏర్పాటు చేశారు. ఐదు కోట్ల వ్యయంతో అధునాతన వైద్య పరికరాలతో టి.టి.డి. నిర్మించిన సెంట్రల్ ఏసీ ఆసుపత్రి ఇది. పేదలకు ఉచిత చికిత్సతోబాటు కృత్రిమ అవయవాలు, క్యాలిపర్స్, ఆహారం, మందులు కూడా ఉచితంగానే అందిస్తారు. రోగులకు సేవ చేయడానికి ఉదారంగా ముందుకు వచ్చేవారిని టి.టి.డి. ఆహ్వానిస్తోంది.


విరాళం మొత్తం

ఈ పథకం కింద కనీస మొత్తం వెయ్యి రూపాయలు. వెయ్యి కంటే తక్కువ మొత్తం అయిన పక్షంలో దాటకు ఎలాంటి సమాచారం అందించకుండా శ్రీవారి హుండీలో జమచేస్తారు. విరాళాల మొత్తాన్ని జాతీయ బ్యాంకులో జమచేసి దానిపై వచ్చే వడ్డీని పథకం నిర్వహణకు వినియోగిస్తారు.

 

విరాళాలను ఏదైనా జాతీయ బ్యాంకులో చెక్ లేదా డిమాండ్ డ్రాఫ్టు రూపంలో ఎగ్జిక్యూటివ్ అధికారి, బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, బి.ఐ.ఆర్.ఆర్.డి., టి.టి.డి, తిరుపతి పేరు మీద తీసి, ది డైరెక్టర్ బి.ఐ.ఆర్.ఆర్.డి. స్కీం, టి.టి.ది, తిరుపతి - 517 501 అనే చిరునామాకు పంపాలి.

 

మరిన్ని వివరాల కోసం సంప్రదించండి..0877 – 2277777, 2233333 

 

ఈ పథకానికి ఆదాయపు పన్ను చట్టం ప్రకారం సెక్షన్ 80(జి)పన్ను రాయితీ వర్తిస్తుంది.