దాతకు అందించే సాధారణ సౌకర్యం
Common Facility for Tirumala Donors
ఒక కాలెండర్ సంవత్సరంలో ప్రతిసారి పదిరోజులు దాటకుండా,దాత 30 రోజులపాటు వసతిగృహంలో బస చేయవచ్చు. దీనికి వర్తించే సర్వీస్ చార్జీలు చెల్లించవలసి ఉంటుంది. ఈ 30 రోజులు దాత తిరుపతిలో లేదా 15 రోజులు తిరుపతిలోని శ్రీనివాసం యాత్రికుల వసతి కాంప్లెక్సులో మిగిలిన 15 రోజులు తిరుమలలోదిగువ సూచించిన విధంగా బస చేయవచ్చు.
తిరుపతి సాధారణ గది తిరుమలలో 200 రూపాయల వసతి
ఏ.సి. సౌకర్యంతో సాధారణ గది తిరుమలలో 400 రూపాయల వసతి
ఏ.సి. సౌకర్యంతో ప్రత్యేక గది తిరుమలలో 600 రూపాయల వసతి
వ్యక్తులకు వారి జీవితకాలంలో / వారి జీవిత భాగస్వామి కాలంలో లేదా 20 సంవత్సరాల ఏది తర్వాత అయితే దాని ప్రకారం ఈ సౌకర్యం వర్తిస్తుంది. సంయుక్తంగా లేదా సంస్థలు, కంపెనీలు, ట్రస్టులు అయితే 20 సంవత్సరాల వరకూ మాత్రమే ఈ వసతి వర్తిస్తుంది.
దాత పేరుమీద కట్టిన గృహం వద్ద అతని పేరు, స్థలం ఉన్న ఫలకాన్ని ప్రముఖంగా ప్రదర్శిస్తారు.




