Home

»

Tv News

Ye Devi Varamo Neevu : రాకీ కుట్ర వెనుక అసలు నిజం బయటపడుతుందా.. మార్కెట్లో మనీష్, అంజలి హంగామా!

Aug 8, 2026 9:34AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'(Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -29 లో.. గీతాంజలి కోసం భానుచందర్ లెటర్ రాస్తాడు. అది వాళ్ళ పిల్లలు చూసి ఏం రాస్తున్నావ్ డాడ్ అని అడుగుతారు. ఇది లవ్ లెటర్  ఈ రోజు మా ఆనివర్సరీ కదా అందుకే పార్టీలో అందరి ముందు చదివి వినిపిస్తానని గీతాంజలిపై ఎంత ప్రేమ ఉందో భాను చెప్తాడు. ఆ తర్వాత ముగ్గురు పిల్లలు కలిసి పేరెంట్స్ కి విషెస్ చేప్తారు. మరొకవైపు రత్నం, రాజారావు డెకరేషన్ ఎక్కడ చెయ్యాలో చెప్తుంటారు. అప్పుడే అంజలి కాఫీ తీసుకొని వస్తుంది. తన వెనకాలే రాకీ వచ్చి తనని ముట్టుకోవాలని ట్రై చేస్తాడు.

ఆ తర్వాత మనీష్ వచ్చి రేయ్ నువ్వు వెళ్లి అక్కడ డెకరేషన్ పనులు చూడమని రాకీని పంపిస్తాడు. పార్టీలో మెనూ ఏమేమి ఉండాలో రాజారావుతో మనీష్ డిస్కషన్ చేస్తాడు. ప్రతీ పార్టీలో ఇవన్నీ కామన్ కదా డిఫరెంట్ గా పెట్టాలని అంజలి మెనూ చెప్తుంది. అవన్నీ నేనే రెడీ చేస్తానని అంజలి చెప్తుంది. దానికి కావాల్సినవి వెళ్లి తీసుకొనిరా అని రాజారావు అంటాడు. నేను తనకి తోడుగా వెళ్తానని రాకీ అనగానే నువ్వు వద్దు మనీష్ వెళ్తాడని రాజారావు అంటాడు. మనీష్ ని తీసుకొని అంజలి  షేర్ ఆటో లో మార్కెట్ కి వెళ్తుంది. అక్కడ అంజలి పీచుమిఠాయి కొనుక్కుంటుంది. అది హైజిన్ ఫుడ్ కాదు ఏదో కలర్ వేసి అమ్ముతారని మనీష్ అంటాడు. అంజలి తింటుంటే కొంచెం తీసుకొని తిని బాగుందని అంటాడు. మళ్ళీ కొనుక్కోవాలని వెళ్తాడు. ఇది కలర్ వేసి అమ్ముతారు .. నేను ఇవ్వనని అతను అంటాడు. ఇక తప్పక ఎక్కువ డబ్బు ఇచ్చి మనీష్ కొనుకుంటాడు.

ఆ తర్వాత అంజలిని ఆఫీస్ అతను చూస్తాడు‌‌. అతను చూడడం మనీష్ చూస్తాడు. అతను గీతాంజలి దగ్గరికి వెళ్లి పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్తాడు. ఈ రోజు మార్కెట్ లో అంజలి కన్పించిందని అతను చెప్తాడు. అది విని గీతాంజలి షాక్ అవుతుంది. తరువాయి భాగంలో అంజలి వంట చేస్తుంటే రాజారావు వెళ్లి నువ్వు నిన్న కొనుకున్న చీర కట్టుకొని రా అని పంపిస్తాడు. అంజలి గదిలోకి వెళ్తుంది. రాకీ రిమోట్ కార్ లో కెమెరా పెట్టి డోర్ కిందకి పంపిస్తాడు రాకీ ఫోన్ లో లైవ్ గా అంజలి బట్టలు మార్చుకునేది చూడాలని అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com