Home

»

Tv News

Godhavari : మోసగాడికి దేహశుద్ధి చేసిన గౌతమి..కిడ్నాప్ డ్రామా బట్టబయలు!

Aug 8, 2026 9:36AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -77 లో..... గౌతమి ఇంకా ఇంటికి రాలేదని జాను వాళ్ళు టెన్షన్ పడతారు. కళ్యాణ్ కూడా ఇంటికి రాకపోవడం తన ఫోన్ కల్వకపోవడంతో డౌట్ వచ్చి కళ్యాణ్ ఫోన్ ట్రేస్ చేసి సూర్య, జాను, నందు, మురళి నలుగురు లొకేషన్ దగ్గరికి వెళ్తారు. కళ్యాణ్ ఉన్న ఇంటి డోర్ కొడుతాడు. కళ్యాణ్ ఫ్రెండ్ డోర్ తీస్తాడు. కళ్యాణ్ డ్రింక్ చేస్తూ కనిపిస్తాడు. సూర్యని చూసి బావ మేం ఏదో ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటాం.. మీరేంటి ఇక్కడ అని  కళ్యాణ్ అంటాడు.

నీకు ఈ అలవాటు కూడా ఉందా అని సూర్య అంటాడు. మా గౌతమి ఎక్కడ రా అని జాను అడుగుతుంది. నాకేం తెలుసు అని కళ్యాణ్ అంటాడు. అందరు ఇల్లంతా వెతుకుతారు. గౌతమి ఉన్న గదిలోపల గడియ పెట్టుకొని ఉంటుంది. తను కింద పడిపోయి ఉంటుంది. ఆ డోర్ జాను తియ్యబోతుంటే జానూ రా అని నందు పిలుస్తుంది. గౌతమికి ఏమైనా కావాలి అని జాను వార్నింగ్ ఇచ్చి వెళ్తుంటే గుమ్మం దగ్గర గౌతమి చేతికి కట్టుకున్న ధారం కనిపిస్తుంది. దాంతో గౌతమి ఇక్కడే ఉందని జాను చెప్తుంది. అందరు మళ్ళీ వెతుకుతారు. గౌతమి ఉన్న రూమ్ ని సూర్య గట్టిగా నెట్టి లోపలికి వెళ్తాడు. అక్కడ గౌతమి కింద పడిపోయి ఉంటుంది. వాటర్ చల్లి జాను లేపుతుంది. గౌతమి ని చూసి నందు, జాను ఏడుస్తారు. గౌతమి డ్రెస్ కొంచెం చినిగిపోయి ఉంటుంది. దాంతో సూర్య తన షర్ట్ ఇస్తాడు. కళ్యాణ్ దగ్గరికి వెళ్లి నా చెల్లిని ఎందుకు కిడ్నాప్ చేశావని కొడుతుంది కొట్టాల్సింది.. గౌతమి అని నందు అంటుంది‌. నువ్వే వాడికి బుద్ది చెప్పాలని నందు అంటుంది. దాంతో గౌతమి తన చెప్పుతో కళ్యాణ్ ని కొడుతుంది. అదంతా కళ్యాణ్ అవమానంగా ఫిల్ అవుతాడు.

ఆ తర్వాత అందరు బయటకు వస్తారు. శారదకి నందు ఫోన్ చేసి గౌతమి ఉంది.. వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్తుంది.. మరుసటి రోజు గౌతమి వాళ్ళ రాకకోసం శారద చూస్తుంది. చుట్టూ పక్కన వాళ్ళు వచ్చి ఇంకా గౌతమి రాలేదా ఎవరితో అయిన వెళ్లి ఉంటుందంటూ తప్పుగా మాట్లాడతారు. అప్పుడే గౌతమిని తీసుకొని జానూ, సూర్య, నందు, మురళి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com