Home

»

Tv News

Ye Devi Varamo Neevu: గీత ఒడిలో మనీష్ ఎమోషనల్ మాటలు.. అంజలి వేసిన పొడుపుకథని విప్పుతాడా!

Nov 14, 2026 9:51AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో‌ నీవు(Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-115లో.. మన ఇనిస్టిట్యూట్ పాస్ పర్సెంటేజ్ పెరిగిందని భానుతో గీత చెప్తుంది. లాస్ట్ ఇయర్ తొంభై ఉండేది.. ఇప్పుడు తొంభై అయిదు శాతం వచ్చిందని‌ గీత చెప్పగానే భాను కంగ్రాట్స్ చెప్తాడు. నాకు కాదని గీత అనగానే హో నాకా.. నాకు అవసరం లేదని‌ భాను అంటాడు. అది కాదు.. దీనికంతటికి కారణం మన మనీష్ అని గీత చెప్తుంది. అప్పుడే అంజలి, భవిత చూస్తారు. ‌అదే సమయంలో మనీష్ ఓ పేపర్ తీసుకొచ్చి.. అత్తయ్య అత్తయ్య మన కాలేజీ రిజల్ట్స్ అని అంటుండగా భాను మనీష్ ని ఆపుతాడు. నాకు తెలుసులేరా తొంభై అయిదు శాతం రిజల్ట్స్ వచ్చాయి కదా.. ‌కంగ్రాట్స్ అని భాను అనగా అదేంటి నాకు చెప్తున్నారు.. అత్తయ్య చేసిందని మనీష్ అంటాడు. ‌లేదు మనీష్ వల్లే ఇది సాధ్యమని గీత అంటుంది. సరే సరే ఇద్దరికి కంగ్రాట్స్ అని భాను చెప్తాడు. ఆ తర్వాత భానుకి కాల్ వచ్చి బయటకి వెళ్తాడు.

 

ఈ సంతోషంలో నీకు ఏదైనా ఇవ్వాలనిపిస్తుందిరా .. చెప్పు నీకు ఏం కావాలిరా.. అని మనీష్ ని అంజలి అడుగుతుంది. నాకు ఏం వద్దు అత్తయ్య అని గీతని సోఫాలో కూర్చోబెట్టి తన ఒడిలో పడుకుంటాడు మనీష్. ఎప్పుడూ ఇలాగే మీ ఒళ్ళో పడుకోవాలి.. మీతో పాటే ఉండాలి.. మన మధ్య ఎవరు రాకూడదు.. ఎవరు మనల్ని విడదీయకూడదని అంటాడు. మనల్ని ఎవరు విడదీస్తారురా అని గీత అంటుంది. మనం ఎవరు విడదీయరని గీత అంటుంది. ఆ తర్వాత మనీష్ బయటకు వెళ్తుంటే ఓ నైంటీ ఫైవ్ పర్సెంట్ అని అంజలి పిలుస్తుంది. దాంతో అంజలి దగ్గరికి వెళ్తాడు మనీష్. నీకు ఒక పొడుపుకథ వేస్తాను.. దానిని నువ్వు విప్పితే నీ వల్లే నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చిందని ఒప్పుకుంటాను లేదంటే నన్ను జీఎమ్ సీట్ లో కూర్చోబెట్టాలని నువ్వే మీ అత్తయ్యతో చెప్పాలని అంజలి పందెం కాస్తుంది.  సరే అని మనీష్ అంటాడు.

 

కళ్లతో చూపించగలం..‌మనసులో ఉంటుంది.. మనిషికి ఇది ఉంటే చాలు అన్నీ ఉన్నట్లే అని పొడుపుకథ వేయగానే మనీష్ ఆలోచనలో పడతాడు‌ . ఎంత ప్రయత్నించినా కనిపెట్టలేక బామ్మ దగ్గరికి వెళ్తాడు. తను కూడా తెలియదని చెప్పడంతో అంజలి దగ్గరికి వెళ్తాడు మనీష్. మొదట దేవుడు అని చెప్తాడు.  ఆ తర్వాత డబ్బు అంటాడు. ఆ తర్వాత ఇంకేదో చెప్పగానే అంజలి వెళ్ళిపోతుంటుంది. దాంతో ఒక్కసారిగా 'ప్రేమ' అని అంటాడు మనీష్. దాంతో అంజలి ఆగి వెనక్కి తిరుగుతుంది. ఇక మనీష్ సరిగ్గా పొడుపుకథని విప్పుతాడు. ఒప్పుకుంటావా నేనే జీఎమ్ అని మనీష్ అనగానే హా సరే అన్నట్టుగా అంజలి తల ఊపుతుంది‌. మరోవైపు మార్కులు తక్కువ వచ్చాయని రోహిత్, కృష్ణజ టెన్షన్ పడుతుంటారు. భవిత మాత్రం యాభై శాతం కన్నా తక్కువ మార్కులు వచ్చినా భయం లేకుంటా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com