.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి' (Godavari). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -163 లో.. శివుడు, పారు లగేజ్ సర్దేసి బయల్దేరుతారు. ఎక్కడికని సంజయ్ అంటే మీ పెళ్లి అయితే దీపం పెడతామని శ్రీశైలం వెళ్తున్నాం అంటారు. మాకు పెళ్లే కాలేదు, మీరు వెళ్లొద్దని సంజయ్ అంటే బామ్మ తాతయ్య షాక్ అవుతారు. దానికి జాను గొడవ అయిందని ఇలా అంటున్నారు, ఎంత గొడవ అయితే మాత్రం పెళ్లి కాలేదు, విడాకులు ఇచ్చేస్తా అంటారా అని అడిగి కవర్ చేస్తుంది. వెళ్లొద్దని సంజయ్ చెప్తే మేం వెళ్తాం, ఏమైనా ఉంటే మీరు మీరు తేల్చుకోండి అని బామ్మ తాతయ్య వెళ్లిపోతారు.
జాను టీవీ చూస్తూ ఉంటుంది. సంజయ్ వచ్చి పక్కనే కూర్చొని మాట్లాడాలని ప్రయత్నిస్తాడు. దాంతో జాను కావాలనే దెయ్యం సినిమా వేస్తుంది. సంజయ్ వణికిపోతాడు. జాను నాకు దెయ్యం అంటే భయం, సినిమా మార్చేయ్ అని సంజయ్ అంటాడు. జాను మార్చదు. సంజయ్ వణికిపోతూ నీకు సారీ చెప్తున్నా కదా, ప్లీజ్ వదిలేయ్ జాను, సినిమా మార్చేయ్ అని అంటే జాను ఫోన్ పట్టి నీ సారీలు నాకు అవసరం లేదంటుంది. ఇంతలో కరెంట్ వెళ్లిపోతుంది. పాపం సంజయ్ జాను ప్లీజ్ జాను భయంగా ఉంది, జాను నీకు దండం పెడతా, నీ చేయి పట్టుకుంటా నన్ను బెడ్ రూంలోకి తీసుకెళ్లు అని అంటాడు. జాను గదిలోకి వెళ్తే సంజయ్ చీర కొంగు పట్టుకుని వెనకాలే వెళ్తాడు. తర్వాత జాను కింద పడుకోవడానికి వెళ్తే జాను ప్లీజ్ రా జాను, ఇద్దరం కలిసి పడుకుందామని జానును బతిమాలుతాడు.
నందు దగ్గరకు మురళీ వెళ్లి షాప్ ఓపెనింగ్ కి రమ్మని బతిమాలుతాడు. నందు రానంటుంది. ఐడియా ఇచ్చింది నువ్వే కదా.. రా నందు అని బతిమాలుతాడు. నేను రాను, ఆఫీస్ లో చాలా పనులున్నాయని నందు అంటుంది. నీ చేతుల మీదగా షాప్ ఓపెన్ చేస్తే తెలీని సంతోషం నందు ప్లీజ్ రా అని మురళీ అడుగుతాడు. నందు రాను అంటే రాను అనేస్తుంది. మురళీ చాలా బతిమాలడంతో సరే ఇలా వచ్చి అలా వెళ్లిపోతానని, కానీ ముందు ఆఫీస్ కి వెళ్లి మధ్యలో వస్తానంటుంది. మురళీ ఓ చీర ఇచ్చి అది కట్టుకుని రమ్మని అంటే ఇది ఒక ఐదు వందలు కూడా ఉండదు.. దీంతో రమ్మంటున్నావ్, ఏం కట్టుకోవాలి, ఏం వేసుకోవాలి అన్నీ నువ్వే చెప్తావా, ఎందుకు నా జీవితాన్ని నీ చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నావని నందు చీర మురళీ ముఖాన విసిరికొట్టి వెళ్లిపోతుంది. మురళీ చీర పట్టుకుని కూలబడి.. నందుకి నా ప్రేమ ఎందుకు అర్థం కావడం లేదు, నేను ఎంత ప్రేమిస్తుంటే అంత ద్వేషిస్తుందని బాధ పడతాడు. మరోవైపు శారద, మురళీ, గౌతమి, కిన్నెరలు పూజ చేస్తారు. ఆఫీస్ లో నందు వాళ్లు పూజ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





