Home

»

Tv News

వెంకటేష్‌తో పని చేయడం చాలా ఈజీ.. మా ఇద్దరి మధ్య మంచి సింక్ ఉంది

Nov 13, 2026 8:52AM

సిల్వర్ స్క్రీన్ మీద వెంకటేష్ కనిపిస్తే చాలు లేడీ ఆడియన్స్ కి ఎక్కడ లేని జోష్ వస్తుంది. ఎందుకంటే ఆయన ఎక్కువ కుటుంబ కథా చిత్రాల్లో నటిస్తారు. అలాంటి వెంకటేష్ తో కలిసి డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎఫ్ 2, ఎఫ్ 3 , సంక్రాంతికి వస్తున్నాం వంటి హిట్ మూవీస్ తీశారు. అలాంటి అనిల్ రావిపూడి వెంకటేష్ గురించి ఒక ఇంటర్వ్యూ లో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పారు.  


వెంకటేష్ గారితో పని చేయడం చాలా సులభంగా ఉంటుందని డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. మొదటి సినిమా నుంచే తమ ఇద్దరి మధ్య మంచి సింక్ కుదిరిందని, ఒకే ఫ్రీక్వెన్సీలో ఆలోచిస్తామన్నారు . వరుసగా మూడు సినిమాలు చేసేసరికి తమ మధ్య ఉన్న బాండింగ్, స్నేహం, నమ్మకం, ఒకరిపై ఒకరికి ఉన్న అవగాహన మరింత పెరిగాయని చెప్పారు. కథ రాసే సమయంలో వెంకటేష్ గారు ఎప్పుడూ తనను డిస్టర్బ్ చేయరని, కథ పూర్తయ్యాక ఆయన నుంచి వచ్చే చిన్న చిన్న సూచనలను కూడా తాను సులభంగానే తీసుకుంటానని వివరించారు. తన అనుభవంతో వెంకటేష్ గారు కథను పూర్తిగా వింటారని, అయితే సన్నివేశాల వివరాలు, వాటి ట్రీట్‌మెంట్‌ను మాత్రం షూటింగ్ స్పాట్‌లోనే ఆస్వాదిస్తూ చేస్తారని తెలిపారు.

కథలోని ఒక్క లైన్ వినగానే అది వర్కవుట్ అవుతుందా లేదా అనే విషయాన్ని వెంకటేష్ గారు అంచనా వేయగలరని అన్నారు. ఏ సన్నివేశం బాగుంటుంది, ఏ లొకేషన్‌లో ఎలా చేస్తే బాగుంటుందనే విషయాలపై ఆయన తన అభిప్రాయాలను చెబుతుంటారని వివరించారు. ఇప్పుడు తమ మధ్య ఉన్న అనుబంధం ఒక కుటుంబ బంధంలా మారిపోయిందని  చెప్పారు. సురేష్ బాబు, వెంకటేష్ మధ్య ఎలాంటి అవగాహన ఉంటుందో, తమ ఇద్దరి మధ్య కూడా అలాంటి అనుబంధం ఏర్పడిందని తెలిపారు. ఒకరి చూపు చూస్తే మరొకరికి ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థమైపోతుందన్నారు.

కెమెరా ముందు వెంకటేష్ గారు నటిస్తున్నప్పుడు ఏదైనా ఎక్స్‌ప్రెషన్ మార్చాలనుకున్నా, ఆయన దగ్గరకు వెళ్లి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, చిన్న సైగ చేస్తే చాలని చెప్పారు. అంతలా తమ ఇద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్, వేవ్‌లెంగ్త్ కుదిరిందని ఆనందం వ్యక్తం చేశారు. తనపై వెంకటేష్ గారు చూపించే నమ్మకం, ఇచ్చే స్వేచ్ఛ తనకు ఎంతో సంతోషాన్నిస్తాయని పేర్కొన్నారు. ఇక తన సినిమాల్లో కనిపించే కొన్ని ప్రత్యేకమైన డైలాగ్స్, మేనరిజమ్స్ గురించి కూడా  చెప్పుకొచ్చారు.  ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ప్రత్యేకమైన డైలాగ్ లేదా మేనరిజమ్ కనిపిస్తుంటుందని, అవే మళ్లీ మళ్లీ కొనసాగించడం సరైనదేనా అని ప్రశ్నించగా.. ఇప్పటివరకు తాను చేసిన ప్రయోగాలన్నీ ప్రేక్షకులకు నచ్చాయని చెప్పారు. ఒకవేళ అవి ప్రేక్షకులకు నచ్చకపోతే అసలు వారి దగ్గరికే వెళ్లేవి కావన్నారు. 'పటాస్' సినిమాలో ప్రత్యేకమైన వన్‌లైనర్స్ లేకుండా కథను నేరుగా నడిపించామని, 'సుప్రీమ్' సినిమా నుంచి 'జింగ్ జింగ్', 'అమేజింగ్' వంటి ప్రత్యేకమైన డైలాగ్స్‌ను పరిచయం చేశామని వివరించారు.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com