సిల్వర్ స్క్రీన్ మీద హ్యాపీ డేస్ తో తెలుగు ఆడియన్స్ మనసులు దోచిన వరుణ్ సందేశ్ అంటే ఇప్పటికీ ఎంతో మందికి ఇష్టం. ఈ మూవీలో వరుణ్ సందేశ్ తెలుగు కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఆ సినిమా టైంకి ఇప్పటికీ ఆయన తెలుగు మాట్లాడడంలో చాలా తేడా వచ్చింది. ఐతే రీసెంట్ గా వరుణ్ సందేశ్ వర్జీనియా వెళ్లినట్టు ఉన్నాడు. అక్కడ తెలుగు అబ్బాయి ఫ్రమ్ వర్జీనియా అనే తెలుగు యూట్యూబర్ వరుణ్ ని కలిసాడు.
ఆ వీడియోని కూడా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసి "నేను రీల్ పోస్ట్ చేసిన ప్రతిసారీ... కనీసం ఒక కామెంట్ అయినా ఇలా ఉంటుంది...“బ్రో... నువ్వు వరుణ్ సందేశ్ లా మాట్లాడుతున్నావు !” అని. అందుకే ఈరోజు... నేను చివరికి వరుణ్ సందేశ్‌ని కలిసి, ఆయన్ని స్వయంగా అడిగాను. మీరేమనుకుంటున్నారు ? మా ఇద్దరి గొంతులు ఒకేలా ఉన్నాయా ? " నా తెలుగు వరుణ్ సందేశ్ తెలుగు సేమ్ గా ఉందా " అని అడిగాడు. ఇక వరుణ్ సందేశ్ ని ఈ విషయం అడిగినప్పుడు ఆ యూట్యూబర్ తనకు తెలుసు అని చెప్పారు. "అందరూ నాది వరుణ్ సందేశ్ తెలుగు అంటారు . " అని యూట్యూబర్ అనేసరికి "అవునా ఇప్పటికైనా నా తెలుగు ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయ్యింది " అని వరుణ్ చెప్పాడు. "నాది మీది సేమ్ అన్నారు. మీరు తెలుగులో ఒక డైలాగ్ చెప్పండి "అని వరుణ్ ని అడిగాడు. "నువ్వు చెప్పు ఆ డైలాగ్ నేను చెప్తాను మళ్ళీ " అని వరుణ్ అనేసరికి "దేవుడా " అని చెప్పాడు యూట్యూబర్ . తర్వాత వరుణ్ కూడా అదే డైలాగ్ చెప్పాడు. సిమిలర్ గానే ఉంది అన్నాడు యూట్యూబర్ . ఆ యూట్యూబర్ పేరు ఆకాష్ ఉదండ్రవ్ .
ఇక నెటిజన్స్ ఐతే "వరుణ్ ని ఇమిటేట్ చేయొద్దు . అతన్ని వదిలేయ్ . కొంచెం మ్యాచ్ అయ్యింది. తేడా ఉంది కానీ ఇద్దరిదీ అమెరికన్ యాక్సెంట్ . ఐనా అది వరుణ్ వాయిస్ కాదు టైసన్ వాయిస్ . మొదట్లో వరుణ్ సందేశ్ అలాగే మాట్లాడేవాడు కానీ ఇప్పుడు కాదు. నిజానికి ఫేస్ కూడా అచ్చం వరుణ్ సందేశ్ లానే ఉంది. " అంటూ ఈ వీడియో కింద రిప్లైస్ ఇచ్చారు.
Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జూనియర్ వరుణ్ సందేశ్ .... ఎవరితను అచ్చం అలాగే ఉన్నాడు
Aug 2, 2026 11:46AM
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com




