నాగ మణికంఠ అంటే బిగ్ బాస్ ముందు వరకు ఎవరో కూడా ఆడియన్స్ కి తెలీదు. కానీ బిగ్ బాస్ సీజన్ 8 తర్వాత అందరికీ తెల్సిపోయాడు. చాలా క్యూట్ గా ఉంటాడు. టాస్కులు ఆడతాడు. అందరితో కలిసిపోతాడు. "ప్రియా స్వాగతం కృష్ణ " అనే వెబ్ సిరీస్ చేసాడు. అలా ఈ సీజన్ నుంచి బెజవాడ బెబక్క, కిర్రాక్ సీత, యష్మి గౌడ, నిఖిల్, ఆకుల సోనియా వంటి వాళ్లంతా బాగా ఫ్రెండ్స్ అయ్యారు. ఇక తర్వాత బుల్లితెర మీద అన్ని రకాల షోస్ లో కనిపిస్తూ ఉన్నాడు.
అలాంటి మణికంఠ రీసెంట్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ ఇంటరెస్టింగ్ వీడియో పెట్టాడు. కలర్ ఫుల్ కాస్ట్యూమ్ లో మెరిసిపోతూ ఒక ఫంక్షన్ లో ఫామిలీ మెంబర్స్ ని పలకరిస్తూ వాళ్ళతో ఫొటోస్ దిగుతూ సందడి చేసాడు. ఇంతకు విషయం ఏంటంటే మణికంఠ చెల్లి కావ్య అమర్నాధ్ సీమంతం వేడుక. ఆ వేడుకలో మణికంఠ కనిపించాడు. ఆ వీడియోస్ ని పోస్ట్ చేసి ఒక నోట్ పెట్టాడు.
"మేనమామ పోలికలతో బుజ్జిబాబు పుట్టాలని దీవిస్తున్నా. చెల్లెమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా " అన్నాడు. ఇక నెటిజన్స్ కూడా విష్ చేస్తున్నారు. ప్రియాంక సింగ్ మణికంఠ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం అందరికీ తెలుసు. ప్రియాంక సింగ్ రిప్లై ఇచ్చింది. "చాలా సంతోషంగా ఉంది మణి . వి లవ్ యు రా . నైస్ మణి గారు. ట్రెడిషనల్ లుక్ లో బాగున్నారు. మీరు, మీ చెల్లి ఇద్దరు చక్కగా ఉన్నారు.. అలానే పుట్టాలి మీకు కూడా " అంటూ కామెంట్స్ చేశారు.
Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సీమంతం వేడుకలో మణికంఠ సందడి...మేనమామ పోలికలతో పుట్టాలని చెల్లికి దీవెన
Aug 2, 2026 12:03PM
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com




