Home

»

Tv News

Bigg Boss Buzz Telugu : బజ్ ఇంటర్వ్యూలో సీక్రెట్స్ బయటపెట్టిన శ్వేత నాయుడు!

Nov 16, 2026 10:59AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10లో పదో వారం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఐదు వారాల పాటు హౌస్‌లో కొనసాగిన శ్వేత నాయుడు పదో వారం ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ జరిగింది. ఇందులో  హోస్ట్ శివాజీ తనదైన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్‌తో శ్వేతను తికమక పెట్టాడు. బిగ్ బాస్ బజ్ వేదికపైకి వచ్చిన శ్వేతా నాయుడిని శివాజీ సరదాగా పలకరించాడు. మొదటే ఆమెకు తనదైన స్టైల్లో కౌంటర్లు వేయడం ప్రారంభించాడు. "అమ్మా.. నీ లక్కీ నెంబర్ పది కదా?" అని శివాజీ ప్రశ్నించారు. దీనికి శ్వేతా అమాయకంగా "ఏడు సర్" అని సమాధానం ఇచ్చింది. వెంటనే శివాజీ తన పంచ్ పేల్చాడు. "అంటే మూడు వారాల కంటే వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారా?" అంటూ సెటైర్ వేశాడు. దీంతో శ్వేత క్యూట్ ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ "మీరు అలా అనకండి" అంటూ నవ్వేసింది.

 

ఆ తర్వాత శ్వేత బిగ్ బాస్ ప్రయాణం గురించి శివాజీ ప్రశ్నించాడు. "పదేళ్ల నుంచి కష్టపడుతున్నాను.. బిగ్ బాస్ వేదికపైకి రావాలని ప్రయత్నిస్తున్నాను" అని శ్వేత చెప్పింది. దీనికి శ్వేత "ప్రయత్నించాను సార్" అని అంది. కానీ శివాజీ మాత్రం ఆమెను వదల్లేదు. "ఎక్కడ ప్రయత్నించావ్? గట్టిగా ప్రయత్నించాలి కదా!" అంటూ నిలదీశాడు. అంతటితో ఆగకుండా "పదేళ్ల కష్టం.. పదో వారం పది నిమిషాల్లో పోయింది కదా!" అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. ఈ మాటలకు శ్వేతా ఎమోషనల్ అయింది.అమన్ గురించి అడిగిన ప్రతిసారీ శ్వేతా అతన్ని ప్రశంసించింది. అమన్ 100 శాతం ట్రాన్స్‌పరెంట్ అంటూ హార్ట్ సింబల్ ఇచ్చింది. ఇక బంగారం లాంటి వ్యక్తి ఎవరని అడిగినప్పుడు కూడా అమన్ పేరునే చెప్పింది. ఇలా ఒకటి కాదు.. ఏకంగా మూడు సందర్భాల్లో అమన్‌ను ప్రశంసించింది. దీంతో శివాజీ "అమన్‌తో క్లోజ్‌నెస్ వెనుక అసలు కథేంటి?" అని నేరుగానే ప్రశ్నించాడు. దానికి శ్వేతా ఏం సమాధానం చెప్పిందో తెలియాలంటే పూర్తి బజ్ ఎపిసోడ్ చూడాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com