
కుకింగ్ రియాలిటీ షో ‘కుక్ విత్ జాతిరత్నాలు–2’ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఆదివారం వచ్చేసింది. తనూజ సీజన్–2 విజేతగా నిలిచింది. మొదటి సీజన్‌లోనూ తనూజ కుక్‌గా పోటీలో పార్టిసిపేట్ చేసింది .
కుకింగ్ రియాలిటీ షో ‘కుక్ విత్ జాతిరత్నాలు–2’ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఆదివారం వచ్చేసింది. తనూజ సీజన్–2 విజేతగా నిలిచింది. మొదటి సీజన్‌లోనూ తనూజ కుక్‌గా పోటీలో పార్టిసిపేట్ చేసింది . అయితే ఫైనల్స్ లో సక్సెస్ కాలేకపోయిని. ఆ సీజన్ లో ‘వదినమ్మ’ ఫేమ్ సుజిత టైటిల్ ని గెలుచుకుంది . ఈసారి మాత్రం తనూజ అద్భుతమైన వంటకాలతో జడ్జెస్ ని మెప్పించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే బిగ్‌బాస్‌లో రన్నర్‌గా నిలిచిన ఆమెకు, ఇప్పుడు కుక్ షో టైటిల్ ని గెలుచుకోవడంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఇక ఫినాలేలో కంటెస్టెంట్స్ అంతా వాళ్ళ వాళ్ళ స్టైల్ వంటకాలతో ఘుమఘుమలాడించారు . ఫినాలేలో డెమాన్ పవన్ రాజుగారి కోడి పలావ్, అరిటాకు చికెన్ స్టేక్, రోజ్‌మేరీ లెమన్ సాస్, పాన్‌ఫ్రై తవ్వ ఫిష్, చీజ్‌కేక్ వంటి వంటకాలను తయారు చేశాడు. ఆషిక రాయల్ హైదరాబాదీ థాలీతో ఆకట్టుకుంది.
రాకింగ్ రాకేష్ అన్ని స్టేట్స్ కి సంబందించిన స్పెషల్ డిషెస్ తో ఒక థాలి తయారు చేసాడు. చాలా తక్కువ టైములో ఎక్కువ వంటలు చేసి జడ్జెస్ మెప్పు పొందాడు. నిఖిల్ నల్లి బొక్కల మటన్ ధమ్ పలావ్ తయారు చేశాడు.
ఇక ఫైనల్ గా తనూజ బాసా చేప విత్ చింతచిగురు, కర్గా మసాలా స్టఫ్డ్ స్కిన్ చికెన్, మటన్ బిర్యానీ, క్రిస్పీ అవకాడో, ఇరానీ చాయ్ డెజర్ట్ లను తయారు చేసింది. వీటిని రుచిని జడ్జెస్ ఆస్వాదించి మెచ్చుకున్నారు.‘ఛాలెంజ్‌గా తీసుకుని మళ్లీ రెండో సీజన్‌కు వచ్చావు.. ఈరోజు నీ వంటలు రాయల్‌గా ఉన్నాయి’ అంటూ సంజయ్ అభినందించారు. శ్రీదేవి కూడా వంటల్లో మంచి వెరైటీ, రుచి ఉన్నాయని ప్రశంసించారు. అలీ, అరుణ ప్రజెంటేషన్‌తో పాటు టేస్ట్ కూడా బాగుందని మెచ్చుకున్నారు. ఫైనల్ గా మార్క్స్ విషయానికి వస్తే 93 మార్కులతో విజేతగా తనూజ నిలబడింది. 5వ స్థానంలో రాకేష్ 88 మార్కులు, 4వ స్థానంలో ఆషిక 88 మార్కులు, 3వ స్థానంలో నిఖిల్ 90 మార్కులు, 2వ స్థానంలో పవన్ 92 మార్కులుతో నిలిచారు. తనూజ ‘కుక్ విత్ జాతిరత్నాలు–2’ విన్నర్ అయ్యింది. దీంతో ఆమెకు రూ.10 లక్షల కాష్ ప్రైజ్ అందించారు.
----------------






