
బుల్లితెర మీద మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్స్ లో హోస్ట్ ప్రదీప్ మాచిరాజు ఒకరు. ఎప్పటినుంచో ఇతన్ని పెళ్ళెప్పుడు అని అడిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి ప్రదీప్ కి రీసెంట్ గా ఒక అమ్మాయి రెడ్ రోజ్ ఇచ్చి మరీ ప్రోపోజే చేసింది. అది కూడా నెక్స్ట్ వీక్ శ్రీదేవి డ్రామా కంపెనీలో టెలికాస్ట్ కాబోతోంది. రీసెంట్ ఆ షో ప్రోమో రిలీజ్ అయ్యింది.
ఇందులో నైనీషా రాయ్ అనే బుల్లితెర నటి ప్రదీప్ కి రెడ్ రోజ్ ఇచ్చేసింది. రావడమే ఈ నటి "పరేషానురా " అనే సాంగ్ కి డాన్స్ చేస్తూ వచ్చింది. తర్వాత అసలు విషయం చెప్పింది. "ఎలా చెప్పాలో తెలీట్లేదు. కానీ నాకు 13 ఏళ్ళ క్రితమే నాకు ఒక అబ్బాయి మీద క్రష్ ఉంది. సో అబ్బాయికి ఇప్పుడు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా . అది చెప్పడానికి ముందు ఒకటి చూపించాలనుకుంటున్నా" అంటూ తన చేతి మీద దీప్ అనే ఇంగ్లీష్ లెటర్స్ తో పాటు బటర్ ఫ్లై , స్టార్స్ అండ్ హార్ట్ ఎమోజిస్ తో ఉన్న ఒక టాటూని తన చేతి మీద వేయించుకున్నది. అది చూపించింది.
"అది ఎవరో కాదు ప్రదీప్ " అని నైనీషా చెప్పేసరికి ప్రదీప్ షాకింగ్ ఫేస్ పెట్టేసాడు. "హే ఎం చెప్తున్నావ్ " అని ప్రదీప్ అడిగేసరికి "నిజం " అంది నైనీషా . మరో పక్క దీపికా పడీపడీ ఎదో వింతను చూసినట్టు చూసింది. "ఇప్పటికి కూడా మీ ఎదురుగా నిలబడితే నా హార్ట్ బీట్ గట్టిగా కొట్టుకుంటోంది " అని చెప్పింది నైనీషా . నైనీషా టీవీ సీరియల్స్ లో నటిస్తుంది అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ కి వస్తూ ఉంటుంది. బ్రహ్మముడి అప్పుగా, వంటలక్క సీరియల్ లో ధారగా ఆడియన్స్ కి పరిచయమే. అలాంటి అప్పు లాస్ట్ ఇయర్ చామంతి సీరియల్ నటుడు ఆశిష్ చక్రవర్తితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది.






