Home

»

Tv News

Godhavari : నందు పెళ్లి పెటాకులు.. సింహాద్రి డబుల్ గేమ్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా!

Jul 8, 2026 11:14AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -50 లో..... అమెరికా అబ్బాయి వాళ్ళ నాన్న వచ్చి మాకు వేరే సంబంధం వచ్చింది ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకొండి అని చెప్తాడు. దాంతో నందు ఏడుస్తుంది. ప్లీజ్ అంకుల్ అలా అనొద్దని అతని కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేస్తాడు మురళి. అప్పుడే సింహాద్రి వచ్చి వాళ్ళని ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నారు.. వాళ్ళు డబ్బు మనుషులు.. అలాంటి ఇంటికి కోడలిగా పంపడం వద్దని సింహాద్రి అంటాడు. అతను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సింహాద్రి అతన్ని సంబంధం క్యాన్సిల్ చేసుకోమని చెప్పిన విషయం గుర్తుచేసుకొని తనలో తనే నువ్వుకుంటాడు.

ఆ తర్వాత ఆ తోట వల్ల నా స్నేహితుడు చనిపోయాడు. ఆ తోట గురించి వదిలేయ్ అమ్మ అని జానూతో సింహాద్రి చెప్తాడు. లేదు అంకుల్ ఇల్లు తెచ్చుకున్నాం.. తోట కూడా తెచ్చుకుంటామని జానూ అంటుంది. నందు ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. అమెరికా సంబంధం ఎందుకే బావని చేసుకోమని పెద్దావిడ అంటుంది. దాంతో తనపై నందు కోప్పడుతుంది. నందు అని మురళి తన చెయ్ పట్టుకుంటాడు. ఇదే సందు అనుకుంటున్నావా అని నందు ఇష్టం వచ్చినట్లు మురళిని తిడుతుంటే తనపై శారద కోప్పడుతుంది. ఆ తర్వాత సింహాద్రి డ్రింక్ చేస్తూ తన ఫ్రెండ్స్ తో మాట్లాడతాడు. ఆ జానూ పెద్ద తల నొప్పిగా మారిందని సింహద్రి అంటాడు. శారదకి సింహాద్రి ఫోన్ చేసి  నందుకి అమెరికా సంబంధం చూసాను అంటాడు. మరుసటిరోజు మురళి గుడికి వెళ్లి ప్రసాదం తీసుకొని వచ్చి ముందు నందు దగ్గరికి వెళ్తాడు. బావ నాకు అమెరికా అంటే చాలా ఇష్టం నేను వెళ్తానా బావ అని ఏడుస్తుంది. వెళ్తావ్ నందు నేను గుడికి వెళ్లి ప్రసాదం తీసుకొని వచ్చానని తనకి ఇస్తాడు.

అప్పుడే సింహాద్రి అతని భార్య ఇంటికి వస్తారు. శారద పెళ్లి వాళ్ళు వస్తున్నారని చెప్తాడు. దాంతో అందరు షాక్ అవుతారు. శారద ఇంట్లో ఎవరికి చెప్పలేదా అని సింహాద్రి అంటాడు. లేదు అన్నయ్య అని శారద అంటుంది. వెళ్లి నందుని రెడీ చెయ్యండి అని సింహాద్రి చెప్తాడు. నందు హ్యాపీగా అవుతుంది. జానూకి మాత్రం డౌట్ గా ఉంటుంది. తరువాయి భాగంలో అక్క నువ్వు అమెరికా వెళ్తే రావా అని నందుతో కిన్నెర అంటుంది. అక్క నాకు ఈ పెళ్లి ఎందుకో వద్దనిపిస్తుందని జానూ అనగానే నందు కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com