Home

»

Tv News

Brahmamudi : ఇందును బ్లాక్‌మెయిల్ చేసిన రేఖ.. రాజ్ సంతకం ఫోర్జరీ చేసిందా?

Jul 8, 2026 11:12AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1078 లో.... రాజు దగ్గరికి నందు వస్తుంది. ఎందుకు మా అక్కని మధ్య లో వదిలేసావ్.. నీ స్వార్థం కోసం కిడ్నాప్ చేసావ్.. డబ్బు తీసుకున్నావ్.. ఇప్పుడు మా అక్కకి సపోర్ట్ చేస్తానని చెప్పి ఇలా వదిలేస్తావా అని నందు కోప్పడుతుంది. నేనేం రాలేదు.. మీ అక్కనే వెళ్లిపొమ్మందని రాజు చెప్తాడు. తను వెళ్ళమంటే వచేస్తావా అని నందు అడుగుతుంది. అయినా నీకేంటి తను ఏదో మీ సొంతం అక్క అయినట్లు అని రాజు అనగానే అవును తను మా సొంత అక్కనే అని నందు చెప్పగానే రాజు షాక్ అవుతాడు. రాజ్ వాళ్ళ బాబాయ్ కొడుకు కళ్యాణ్ కూతురిని అని నందు చెప్పగానే అందుకేనా సపోర్ట్ అని రాజు అంటాడు.

ప్లీజ్ నేను చెప్తున్నాను.. నువ్వు వెళ్ళమని నందు చెప్తుంది. వెళ్లను.. తను రమ్మని చెప్పేవరకు నేను వెళ్ళనని రాజు చెప్తాడు. మరొకవైపు ఇక మనకి అడ్డు ఎవరు లేరు.. ఇందు ఈ బిజినెస్ ని ఆస్తులని చూసుకోలేదు.. ఇక ఆస్తులన్నీ నా పేరున రాయాలని రేఖ అంటుంది. అది జరగదని అపర్ణ అంటుంది. ఇందు సంతకం పెట్టినా రాజు పెట్టడు అని అపర్ణ అంటుంది. ఆల్రెడీ రాజు చేత పెట్టించాను.. కంపెనీ ఫైల్స్ అంటూ ఆఫీస్ లో పెట్టించానని రేఖ అనగానే అందరు షాక్ అవుతారు. ఇప్పుడేం చెయ్యాలని ఇందు టెన్షన్ పడుతుంది. ఇందుని రేఖ బ్లాక్ మెయిల్ చేసి సంతకం చేయమని చెప్పి వెళ్ళిపోతుంది. మరొకవైపు లక్కీని చలపతి పిలిపిస్తాడు. ఒరేయ్ రాజు అలా ఉండడం నాకు నచ్చడం లేదురా.. నువ్వు వస్తే వాడు మారుతాడని పిలిపించానని చలపతి చెప్తాడు.

ఆ తర్వాత రాజు దగ్గరికి లక్కీ డ్రింక్ పట్టుకొని వస్తాడు. రాజు అవన్నీ పట్టించుకోకుండా డల్ గా ఉంటాడు. అప్పుడే అపర్ణ ఫోన్ చేస్తుంది. ఇక్కడ గోరం జరుగుతుంది.. ఆ రేఖ ఆస్తి పేపర్స్ పై సంతకం పెట్టమని అంటుందని చెప్పగానే దానికి నా సంతకం పెట్టాలని రాజు అంటాడు. నువ్వు పెట్టేశావ్ అంట .. ఆ రేఖ ఏదో ఫైల్ అని చెప్పి పెట్టించిందట.. నాకు భయంగా ఉంది రాజు.. ఆస్తులు చెయ్ జారిపోయేలా ఉన్నాయని అపర్ణ టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com