
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో లేటెస్ట్ ఎపిసోడ్ కి గుండె నిండా గుడిగంటలు సీరియల్ టీమ్ వచ్చింది. 700 ఎపిసోడ్స్ పూర్తైన సందర్భంగా సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. ఇందులో ప్రభావతిగా నటిస్తున్నా అనిలా- శ్రీకుమార్ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. ఆమె లవ్ స్టోరీ ఏంటో శ్రీముఖి చెప్పించింది. ఇక ప్రభావతికి పెళ్ళై 30 ఏళ్ళు ఐన సందర్భంగా ఆమె భర్త శ్రీకుమార్ ని స్టేజి మీద ఇన్వైట్ చేసింది శ్రీముఖి.
"30 ఏళ్ళ మీ ప్రేమకథ అసలు ఎక్కడ మొదలయ్యింది " అని అడిగింది శ్రీముఖి. "మాది లవ్ మ్యారేజ్ నేను ఆయన్ని నా ఫస్ట్ సీరియల్ లోనే చూసాను. అప్పటికి లవ్ ఐతే లేదు. మొదటి సారి నేను అతన్ని త్రివేండ్రం రైల్వే స్టేషన్ లో కలిసాను. మాది నార్త్ కేరళ ఆయనది సౌత్ కేరళ. నన్ను రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్ కి వచ్చారు. సీరియల్ లో ప్రొడక్షన్ కంట్రోలర్ గా ఉండేవారు అప్పుడు. అప్పట్లో 13 ఎపిసోడ్స్ సీరియల్స్ కదా వీక్లీ ఒక్కసారి టెలికాస్ట్ అయ్యేవి. అలా షూటింగ్ చేసుకుని వన్ మంత్ తర్వాత వెళ్లిపోయేవాళ్ళం. ఆ తర్వాత నెక్స్ట్ సీరియల్ కి ఆయనే పిలిచారు. ఆ సీరియల్ మధ్యలో ఆయన నాకు ప్రొపోజ్ చేశారు. మా ఇంట్లో మా పెళ్ళికి ఒప్పుకోలేదు. మా అబ్బాయి పుట్టేవరకు ఒప్పుకోలేదు. ఆయన ఆడవాళ్లకు చాలా గౌరవం ఇస్తారు. మా పెళ్లి టెంపుల్ లో జరిగింది సింపుల్ గా జరిగింది. తర్వాత రిసెప్షన్ పెట్టుకున్నాం. " అని చెప్పారు.
దాంతో శ్రీముఖి వాళ్లకు పెళ్లి బట్టలు ఇచ్చి వాళ్లకు స్టేజి మీద గ్రాండ్ గా వివాహం చేసింది వాళ్ళ టీమ్ అందరితో కలిసి. అలాగే ఆమెకు గజ్జెలు నటరాజ స్వామి విగ్రహాన్ని కూడా బహుమతిగా ఇచ్చింది. ఆయన చెయ్యి పట్టుకుని నేను నటన మొదలుపెట్టాను. నా జీవితం ఎలా ఉంటుందో తెలీదు. మా అమ్మ నాన్న నన్ను ఎలా చూసుకుంటారో ఆయన అలాగే చూసుకుంటారు. నన్నొక చిన్న పిల్లలా చూసుకుంటారు " అని చెప్పారు అనిలా శ్రీకుమార్.




.webp)
