Home

»

Tv News

Brahmamudi : లక్కీ అసలు నిజం తెలుసుకున్న రాజ్.. రేఖ మైండ్ బ్లోయింగ్ స్కెచ్!

Jul 12, 2026 1:30PM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1082 లో.... లక్కీ తన అమ్మ ఎలా ఉంటుందో చూడాలని ఎమోషనల్ అవుతాడు. నువ్వు ఏం టెన్షన్ పడకురా తప్పకుండా మీ అమ్మని కలుస్తావని రాజు ధైర్యం చెప్తాడు. తనని పడుకోపెట్టి  రాజు బయటకు వస్తాడు. అప్పుడే ఆంటోని బయటకు వెళ్లడం చూసి తనని ఫాలో అవుతాడు. ఆంటోని అర్ధరాత్రి రేఖని కలిసి మాట్లాడతాడు. అది రాజు చూసి రేఖ పిన్నితో మాట్లాడుతున్నాడు. ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తాడు. మీరు ఇరవై అయిదు సంవత్సరాల క్రితం చేసిన తప్పుకి ప్రతిఫలం పెద్దగా అయిందని రేఖతో అంటోని చెప్తాడు.

ఇప్పుడు అదంతా నాకు ఎందుకు చెప్తున్నావ్.. అప్పుడే నా దగ్గర వరకు రావద్దని డబ్బు ఇచ్చాను కదా అని రేఖ అంటుంది. మీరు పెళ్లికి ముందు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడని మీ బాబుని నాకు ఇచ్చారు.. అప్పుడు మీరు ఇచ్చిన డబ్బు చాలా చిన్నది.. ఇప్పుడు నాకు ఎక్కువ కావాలని అంటోని అంటాడు. మీ కొడుకు రోజు మా అమ్మ ఎక్కడా అని నా ప్రాణం తీస్తున్నాడు.. పాపం వాడు పేరుకే లక్కీ కానీ వాడికి లక్కే లేదని అంటోని అనగానే అదంతా దూరం నుంచి చూస్తున్న రాజు షాక్ అవుతాడు. ఏంటీ లక్కీ గాడు రేఖ పిన్ని కొడుకా అని షాక్ అవుతాడు. ఆ విషయం వాడికి చెప్పకుండా ఉండాలంటే నాకు యాబై లక్షలు ఇవ్వాలి.. మీకు వారం టైం ఇస్తున్నానని రేఖకి ఆంటోని చెప్పి వెళ్తాడు. ఆ తర్వాత రేఖ దగ్గరికి రాజు వచ్చి‌.. అదంతా విన్నాను పిన్ని మీరు గతం దాస్తూ బాగానే నెట్టుకొస్తున్నారని రాజు అంటాడు. ఇంతకు మీ కొడుకు ఎవరో తెలుసా.. నా ఫ్రెండ్ లక్కీ గాడు ఉన్నాడు కదా వాడే అని రాజు అనగానే రేఖ షాక్ అవుతుంది. పాపం వాడు అమ్మ అని బాధపడుతున్నాడు.‌ ఇప్పటికైనా ఇంట్లో విషయం చెప్పి వాడిని దగ్గరికి తీసుకోండి. మీకు ఒక్క రోజు టైం ఇస్తున్నానని రాజు తనకి వార్నింగ్ ఇస్తాడు. మరుసటి రోజు భ్రమరాంబ, ఐశ్వర్య కలిసి ఇందు చేత పనులు చేయిస్తుంటే మీ పనులు మీరు చేసుకోలేరా అని నందు వాళ్ళపై కోప్పడుతుంది.

ఇప్పుడు రేఖ ఆంటీకి చెప్పి నీ సంగతి చెప్తానని ఐశ్వర్య, భ్రమరాంబ కలిసి నందుతో అంటారు. అప్పుడే రేఖ వస్తుంది. వాళ్ళు ఇద్దరు ఏం చెప్పినా పట్టించుకోకుండా.. రాత్రి రాజు వార్నింగ్ ఇచ్చింది గుర్తుచేసుకొని బయటకు వెళ్తుంది. చూసావా మీ ఆంటీ కూడా ఏం అనట్లేదని నందు అంటుంది. తరువాయి భాగంలో మీ అమ్మ ఎవరో తెలిసిందిరా అని లక్కీతో రాజు అంటాడు. ఆ తర్వాత రాజు వెళ్తుంటే రేఖ ఆక్సిడెంట్ చేపిస్తుంది. రాజు హాస్పిటల్ లో ఉండగా రాజు దుగ్గిరాల వారసుడు అని ఇందుకి చలపతి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com