అయ్యబాబోయ్ సమీరా..సుధీర్ ని రసికుడు, పశుపతి అనేసిందేంటి...
on Jul 12, 2025

సుధీర్ ఏ షోలో ఉంటే ఆ షో వాళ్ళు తెగ ఆడేసుకుంటున్నాడు. రీసెంట్ గ సుధీర్ ని సమీరా భరద్వాజ్ సర్కార్ సీజన్ 5 లేటెస్ట్ ప్రోమోలో ఫుల్ ఫ్రై చేసి పారేసింది. గుణలో కమలహాసన్ చెప్పే కవితను సాంగ్ గా రాసే రేఖ సీన్ గుర్తుంటే చాలు. ఈ ప్రోమోలో కూడా అలాగే జరిగింది. సమీరా స్టేజి మీదకు రాగానే "నా మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్తే మీరేమన్నా రాసిస్తే" అంటూ సుధీర్ సమీరాని అడిగాడు. "నీ మనసులో ఫీలింగ్స్ ఒక పేపర్ లో సరిపోతాయా" అని అడిగింది. "రాయి" అన్నాడు సుధీర్ "ఏంటి" అంది సమీరా. "లెటర్" అన్నాడు సుధీర్ "ఎవరికీ" అంది సమీరా "అమ్మాయిలకు అన్నాడు సుధీర్ 'ఓహో మీరు పార్కులో ప్యాంప్లెట్స్ పంచినట్టు పంచుదామని డిసైడ్ అయ్యారా ఈ ప్రేమ లేఖను" అని కౌంటర్ వేసింది సమీరా. "నా ప్రియా..ప్రేమతో" అని సుధీర్ చెప్తుండగా సమీర్ అచ్చం గుణ మూవీ హీరోయిన్ రేఖలా నవ్వింది. "ఇంకా అక్కడ నువ్వెంత ఏమీ లేదు" అని సమీరా పరువు తీసేసాడు సుధీర్. "కమ్మని నీ ప్రేమ లేఖలే రాసాడు రసికుడే..ప్యాంటు షర్టు వేసిన పశుపతొచ్చేలే.." అంటూ రాసింది. అంటే సుధీర్ ఫేస్ మాడిపోయింది.
తర్వాత రోల్ రైడా వచ్చాడు షోకి. "ప్రాబ్లమ్ ఏంటన్న అసలు చెప్పు నాకు" అన్నాడు రైడా. "ఇప్పుడు గడ్డి ఉంది..నిప్పురవ్వలు గడ్డి మీద పడితే ఏమొస్తాది" అంటూ ఒక తింగరి ప్రశ్న అడిగాడు. దాంతో రైడా బుర్ర గోక్కున్నాడు. సమీరా సింగర్ గా కంటే రీల్స్ తో ఫుల్ ఫేమస్ అయ్యింది. నారాయణ అనే కాన్సెప్ట్ తో చేసిన రీల్ ఐతే సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



