లక్ష రూపాయలు ఇవ్వబోతున్న శుభశ్రీ ? ఎందుకు ? ఎప్పుడు ? ఎలా ?
on Jul 12, 2025

ఈరోజున చారిటీ చేయడం అంటే ఎంతో కష్టమైన పని. కానీ కష్టాల్లో ఉన్నవారిని తెలుసుకుని నిజంగా తోచినంత సాయం చేయడం ఈరోజుల్లో ఒక మంచి విషయంగా చెప్పుకోవాలి. ఇంతకు ఈ చారిటీ ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారా.. శుభశ్రీ రాయగురు ఆమె బెటర్ హాఫ్ అజయ్. బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ ఈమె. త్వరలో పుట్టినరోజు ఉన్న సందర్భంగా ఆమె కష్టాల్లో ఉన్నవాళ్లకు సాయం చేద్దామని అనుకుంటున్నట్టు ప్రకటించింది. "నా పుట్టిన రోజును పురస్కరించుకుని ఒక పది మందికి ఒక్కొక్కరికి 10 వేలు చొప్పున ఇద్దామనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్ లో కానీ డి.ఎంలో కానీ మీ రిక్వయిర్మెంట్ ఏముందో చెప్పండి. కానీ అది జెన్యూన్ గా ఉండాలి.
మా ఎంగేజ్మెంట్ తర్వాత చాలామంది ఫ్లడ్స్ కారణంగా చాలా నష్టపోయాం సాయం చేయండి అంటూ మెసేజెస్ చేశారు. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతానికి ఈ మాత్రం చేయగలుగుతున్నాం. కానీ ఫ్యూచర్ లో ఇంకా చేయగలుగుతామేమో చూడాలి. ఇక ఇదేమీ ప్రమోషనల్ వీడియో కాదు. స్పాన్సర్ వీడియో కూడా కాదు. పర్సనల్ వీడియో. చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ ఉన్నారు. అందుకే ఈసారి వాళ్లకు హెల్ప్ చేద్దామనుకుంటున్నాం. మా సైడ్ నుంచి మేము చేస్తాం అలాగే మీ సైడ్ నుంచి మీరు జెన్యూన్ గా ఉండండి. డిపి లేని అకౌంట్స్ అలాంటి వాటితో మెసేజ్ చేయండి అని చెప్పింది. ఇక 15 వ తేదీన మేము లైవ్ కి వస్తాము. సెలెక్ట్ చేసుకున్న ఆ పది మంది పేర్లను అనౌన్స్ చేస్తాం. అంత పెద్ద సాయం కాదు చాల చిన్న సాయమే." అని చెప్పారు శుభశ్రీ, అజయ్. ఇక ఈమె తెలుగు, తమిళ్ మూవీస్ లో ఈమె నటించింది. 2020 లో విఎల్సిసి ఫెమినా మిస్ ఇండియా ఒడిశాగా నిలిచింది. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత మూవీస్ లో నటించింది శుభశ్రీ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



