Home

»

Tv News

ముద్దు పెట్టిన దీప.. ప్రదీప్‌ని కొట్టిన శేఖర్ మాస్టర్

Mar 26, 2026

స్టార్ మా పరివార్ అవార్డ్స్ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి బిగ్ స్క్రీన్ స్మాల్ స్క్రీన్ మీద ఉన్నవాళ్ళంతా వచ్చారు. ప్రదీప్ శేఖర్ మాష్టర్ మీద సెటైర్స్ వేసాడు. "బిబి జోడి షోకి నేను హోస్ట్ గా చేస్తున్నాను. సర్ జడ్జ్ గా చేస్తున్నారు. మేము చాలా సార్లు అడుగుతాము సర్ రెండు స్టెప్పులు అని పాపం ఆయన ఎప్పుడూ గర్ల్స్ తోనే వేస్తారు." అనేసరికి శేఖర్ మాస్టర్ ప్రదీప్ వీపు మీద ఒక్కటిచ్చారు. "బెస్ట్ బ్రదర్ అనిపించుకోవాలంటే ఎం చేస్తారు మీరు " అని శ్రీవిష్ణుని అడిగాడు ప్రదీప్. "చెప్పింది వినాలి " అన్నాడు. "ఇట్స్  షాకింగ్ . అలాంటివి కుదరవు కదా సర్. " అని ప్రదీప్ అన్నాడు. "వినాలి . చేయక్కర్లేదు " అన్నాడు శ్రీవిష్ణు. తర్వాత ఉత్తమ కూతురు అవార్డుని కార్తీక దీపం సీరియల్ హీరోయిన్  దీపకు ఇచ్చారు. "ఎన్నిసంవత్సరాలు నిరుపమ్ తో చేస్తారండి " అంటూ అవినాష్ దీపను అడిగాడు. "మీరు వస్తారా అండి "అని గోముగా అడిగింది.

వెంటనే ఇండస్ట్రీకి ఒక కొత్త హీరోని తీసుకొచ్చాను అంటూ ఒక రోబోట్ ని తెచ్చాడు. దానికి దీప ముద్దు పెట్టింది. "ఐ లవ్ యు దీపా గారు " అంటూ చెప్పింది ఆ రోబోట్. దీపా కూడా ఐ లవ్ యు అని ముద్దు పెట్టింది. తరువాత "నిహారిక గారు మీరు నవ్వుతుంటే చాల అందంగా ఉన్నారు " అనేసరికి నిహారిక నవ్వేసింది. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా కలిసి నాగార్జునను స్టేజి మీదకు తీసుకొచ్చారు. "మిమ్మల్ని వెండితెర మీద చూడడం కంటే బుల్లితెర మీద చూస్తూ ఉంటె మా నాగార్జున గారు మా నాగార్జున గారు అన్న ఫీలింగ్ వస్తోంది " అంటూ చెప్పింది శ్రీముఖి. ముందుగా మా హౌస్ మేట్స్ కి శుభాకాంక్షలు . వాళ్ళతో ఫ్రెండ్ షిప్ కానీ వాళ్ళ వేషాలు కానీ పరీక్ష ఐపోయింది నాకు ఐనా ఆ షో అంటే నాకు చాల ఇష్టం. బిగ్ బాస్ సీజన్ 9 రోలర్ కోస్టర్ అంటే మిగతా సీజన్స్  కాదని కాదు" అని చెప్పారు నాగార్జున.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com