Home

»

Tv News

Sreemukhi: యాంకర్ శ్రీముఖి కొత్త బిజినెస్!

Mar 26, 2026

యాంకర్స్, యాక్టర్స్ వ్యాపార రంగంలోనూ రాణించడం చూస్తూనే ఉంటాం. ఇప్పుడిదే బాటలో ప్రముఖ యాంకర్ శ్రీముఖి(Sreemukhi) పయనిస్తోంది. ఆమె ఒక రెస్టారెంట్ ను స్టార్ట్ చేసింది.

హైదరాబాద్ మాధాపూర్‌లోని క్యాపిటల్ పార్క్ లో శ్రీముఖి సమక్షంలో ఫుర్సత్ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభమైంది. శ్రీముఖి తన పార్ట్నర్స్ శ్రావణ్, ఆనంద్, రవిలతో కలిసి ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించింది.

ఈ కార్యక్రమానికి ప్రముఖ అతిథులు, మీడియా ప్రతినిధులు, ఆహ్వానితులు హాజరై, మల్టీ-కుయిజిన్ వంటకాలతో పాటు ఆకర్షణీయమైన వాతావరణాన్ని కలిపిన ప్రత్యేక డైనింగ్ కాన్సెప్ట్‌ను ఆస్వాదించారు.

ఫుర్సత్ రెస్టారెంట్ ప్రారంభ సందర్భంగా శ్రీముఖి మాట్లాడుతూ.. “నాకు భోజనం చాలా ఇష్టం, ముఖ్యంగా చికెన్ వంటకాలు—బిర్యానీ, ఇంటి స్టైల్ కర్రీలు చాలా ఇష్టం. అలాగే వెజిటేరియన్ వంటకాలు కూడా నేను ఇష్టపడతాను. ఫుర్సత్ రెస్టారెంట్‌లో ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి ఉంటుంది. ఇది కేవలం ఒక రెస్టారెంట్ మాత్రమే కాదు—ఇది ఒక అనుభూతి, ఒక వాతావరణం. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వచ్చి రిలాక్స్ అవ్వడానికి ఇది మంచి ప్రదేశం. అందుబాటు ధరలు, ప్రత్యేక వంటకాలు, సుమారు 300 మంది కూర్చునే సదుపాయంతో పాటు బ్యాంక్వెట్ సౌకర్యాలు కలిగి ఉండటం వల్ల, హైదరాబాద్‌లో మంచి ఆహారం, వేడుకల కోసం ఒకే చోటుగా ఫుర్సత్ నిలుస్తుందని ఆశిస్తున్నాం.” అని తెలిపింది.

శ్రావణ్, ఆనంద్, రవి, శ్రీముఖి భాగస్వామ్యంతో ఫుర్సత్ రెస్టారెంట్ హైదరాబాద్‌లో ప్రత్యేకమైన గుర్తింపు పొందే డైనింగ్ గమ్యస్థానంగా అవతరించడానికి సిద్ధంగా ఉంది. శ్రీముఖి పార్ట్నర్షిప్ ఈ బ్రాండ్‌కు ప్రత్యేక ఆకర్షణను తీసుకొస్తుంది. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com