సర్కార్ సీజన్ 6 లేటెస్ట్ ఎపిసోడ్ నవ్వొచ్చేలా ఉంది. ఈ ఎపిసోడ్ కి "పాపం ప్రతాప్" మూవీ టీమ్ నుంచి తిరువీర్, ప్రసాద్ బెహరా, ఆంటోనీ, స్నేహ వచ్చారు. ఐతే ఇందులో సుధీర్ వీళ్ళ తొలిప్రేమ గురించి ఒక ఇంటరెస్టింగ్ టాపిక్ అడిగాడు. ముందుగా ఆంటోనీ చెప్పుకొచ్చాడు. "ఎల్ కేజీ నా ఫస్ట్ క్రష్ మొదలయ్యింది. మా స్కూల్ రగడ ఫుడ్ ఫేమస్. దాన్ని ఆమె కోసం తీసుకెళ్లా." ఐతే మీది ఫుల్ రగడ స్టోరీ అన్నాడు సుధీర్. తర్వాత ప్రసాద్ బెహరా చెప్పాడు "తొలిప్రేమ 5 వ తరగతిలో మొదలయ్యింది. ప్రేమో క్రష్ అనేది తేలీదు. ఊళ్ళో ఫంక్షన్స్ అవుతూ ఉంటాయి కదా ఒకసారి అమ్మాయి కోసం వాటర్ ఇచ్చే గ్లాస్ లో ఒక లడ్డు, ఒక అరటిపండు తీసుకెళ్లి అలా ఎక్స్చేంజ్ చేసుకున్నాం ఫస్ట్. అప్పుడే మేము దొరికిపోయాం " అని చెప్పాడు. తర్వాత స్నేహ చెప్పుకొచ్చింది "8 వ తరగతిలో స్వీట్ కిస్ అనే చాక్లెట్ ఉండేది. అతను అది ఇచ్చేవాడు నాకు. నేను ఎప్పుడైనా వాళ్ళ క్లాస్ కి డస్టర్ కోసమో ఇంకా దేనికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ క్లాస్ వాళ్లంతా ఏయ్ వచ్చింది వచ్చింది మీ పిల్ల వచ్చింది అంటూ ఆటపట్టించేవాళ్ళు. అతను ఇంట్రావర్ట్ నేను ఫుల్ ఎక్స్ట్రావర్ట్ కాబట్టి నేను బాగా మాట్లాడేదాన్ని. అతని పేరు అన్వేష్. అతను ఈ ఎపిసోడ్ చూస్తూ ఉండొచ్చు" అంటూ చెప్పేసింది. "5 లోనో 6 లోనో భూభ్రమణం అనే పాఠం ఉండేది. భూమి ఎలా తిరుగుతుంది అనే విషయాన్నీ మా క్లాస్ రూమ్ లో లైట్ తీసేసి టార్చ్ వేసి గ్లోబ్ మీద ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తున్నారు. మా ఎదవ నాతో ఉండే ఫ్రెండ్ తో బాగా చెప్తున్నారు కదా అని చెప్పాను. క్లాస్ ఐపోయి లైట్ ఆన్ అయ్యాక నా పక్కన నా ఫ్రెండ్ ప్లేస్ లో ఒక అమ్మాయి ఉంది. అంటే చీకటి గదిలో మా వాడి మీద చెయ్యి వేయకుండా ఆ అమ్మాయి మీద చెయ్యేసి క్లాస్ విన్న. అక్కడి నుంచి తెలీకుండానే ఆ అమ్మాయి మీద అట్రాక్షన్ పెరిగింది. రెండు మూడేళ్లు నడిచింది. ఊళ్ళో కదా మంట దగ్గర కూర్చోవడం, ఆ అమ్మాయి కోసం తొంగి చూడడం వంటివి చేసేవాడిని. తర్వాత నేను ఊరు వెళ్ళిపోయాను వాళ్ళు ఎటు వెళ్లిపోయారో తెలీదు " అని చెప్పాడు.




.webp)
