
సర్కార్ సీజన్ 6 లేటెస్ట్ ప్రోమోలో సుధీర్ ప్రేమికుడి అవతారం ఎత్తాడు. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి హెబ్బా పటేల్, పాయల్ రాజ్ పుత్, రాశి సింగ్, గెహెనా సిప్పి వచ్చారు. "ఎం చెప్పాలో కూడా మర్చిపోతున్నా. అంత అందంతో ఎందుకు నన్ను మైమరిపిస్తున్నారు." అన్నాడు హెబ్బా పటేల్ ని చూసి. "నా ఫిలిమ్స్ లో నచ్చిన ఫిలిం ఏంటి " అని అడిగింది. "24 కిస్సెస్" అన్నాడు. "నేను ఇన్ని సినిమాలు చేస్తే చేస్తే ఆ ఫిలిం నచ్చిందా" అని అడిగింది. "అదే నాకు బాగా కనెక్ట్ అయ్యింది" అన్నాడు. "నా సాంగ్స్ కలెక్షన్స్ లో ఏ సాంగ్ ఇష్టం" అంటూ అక్కడికి వచ్చిన పాయల్ అడిగింది.
"పిల్లా రా . కనిపించిన వాళ్లందరికీ ఇదే చెప్తూ ఉంటా " అన్నాడు సుధీర్. తర్వాత రాశి సింగ్ వచ్చింది. "దేవుళ్ళకు కూడా ఎమన్నా ఒలింపిక్ కాంపిటీషన్స్ జరుగుతాయా ఏంటి అదేదో గోల్డ్ మెడల్ కోసం చెక్కినట్టు ఇంత అందంగా చెక్కారేంటండి బాబు మిమ్మల్ని " అని అడిగాడు. అంతే పడిపోయింది రాశి . "అందరికీ అలానే చెప్తున్నారు ఏంటిది " అని హెబ్బా పటేల్ అడిగేసరికి "మీ చూపులు నా వీపుకు కాదు గుండెల్లో గుచ్చుకుంటున్నాయి" అన్నాడు పాపం ఏడుస్తూ. "గెహనా సిప్పి చేసావు నా మనసును పిప్పి " అంటూ తెగ ఆటపట్టించాడు.
గుండెల్లో ఎక్కడో తెలీని నొప్పి. తగ్గించావా ఒక్కసారి ఐ లైక్ యు సుధీర్ అని చెప్పి" అన్నాడు. "ఫ్లర్ట్ చేసే కొద్దీ మీ అందరికీ అలుపొస్తుందేమో కానీ నాకు ఊపొస్తది" అన్నాడు సుధీర్ మంచి జోష్ తో. "ప్రతీ ఒక్కరికీ ఒక లవ్ స్టోరీ ఉంటుంది అది చెప్పండి" అంటూ సుధీర్ అడిగేసరికి "మా క్లాస్ ప్రొఫెసర్ బాగా ఇష్టం . అకౌంట్స్ 98 మర్క్స్ వచ్చాయి అక్కడితో నా లవ్ స్టోరీ కూడా ఐపోయింది. " అని హెబ్బా పటేల్ చెప్పింది. "పాఠాల్ని ప్రేమించామన్నారు కానీ పాటలు చెప్పేవాళ్లను " కాదు అంటూ సుధీర్ కౌంటర్ ఇచ్చాడు. "ఇక నా వైపు నుంచి సైలెంట్ లవ్ అంతే. వన్ సైడ్ లవ్ . ఇప్పుడు అవన్నీ గుర్తుచేసుకోవాలని అనుకోవట్లేదు" అని చెప్పింది పాయల్. "ఇంత బాధలో ఉన్న మిమ్మల్ని హగ్ చేసుకుని ఓదార్చాలి " అంటూ హగ్ చేసుకున్నాడు. అంతే మిగతా వాళ్లంతా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నావు కదా అనేసరికి ఒక్కొక్కరి దగ్గరకు వెళ్లి హగ్ చేసుకుని ఓదార్చాడు






