Home

»

Tv News

Jayam serial : సూపర్ మార్కెట్ కి వెళ్ళిన ప్రమీల.. వీరు ప్లాన్ అదే!

Mar 07, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -210 లో... ప్రమీల సూపర్ మార్కెట్ కి వెళ్లకుండా ఆపాలని ఇప్పుడు ప్రమీల వెళ్తే ఇంటి పరువు ఏమవుతుందని వీరు, ఇషిక కలిసి శకుంతల మనసులో నెగెటివ్ క్రియేట్ చేస్తారు. ప్రమీల సూపర్ మార్కెట్ కి వెళ్ళడానికి శకుంతల దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తుంది. నన్ను ఆశీర్వాదించండి అత్తయ్య అని ప్రమీల అనగానే ఏమని ఆశీర్వదించాలి.. కుటుంబ గౌరవం పోగొట్టమని దీవించాలా విజయంద్ర ప్రతాప్ కోడలు సూపర్ మార్కెట్ కి వెళ్లి పని చేస్తుందంటే పరువు పోతుందని ఆశీర్వదించాలా అని శకుంతల అనగానే.. నేను ఈ ఇంటికి పరువుపోయే పని చెయ్యనని ప్రమీల ఏడుస్తూ బయటకు వస్తుంది. ఏమైందని ఇంట్లో వాళ్ళు అడుగుతారు. నేను వెళ్ళలేనని ప్రమీల ఏడుస్తూ పైకి వెళ్తుంటే.. ఆగు ప్రమీల నువ్వు మళ్ళీ చీకటిలోకి వెళ్తున్నావ్.. అలా ఉండకూడదనే కదా ఈ నిర్ణయం తీసుకున్నానని రుద్ర అంటాడు.

ఇప్పుడు ఇంట్లో నుండి బయటకు వెళ్లే ఆడవాళ్ల ఇళ్లలో గౌరవం లేనట్లేనా.. ఆడవాళ్లు అన్ని రంగాల్లో ముందు ఉంటున్నారని ప్రమీలకి రుద్ర మోటివేషన్ ఇస్తాడు. దాంతో ప్రమీల తిరిగి సూపర్ మార్కెట్ కి వెళ్ళడానికి సిద్ధం అవుతుంది. శకుంతల షాకింగ్ గా చూస్తుంది. ఆ తర్వాత ప్రమీల, పెద్దసారు, రుద్ర కలిసి సూపర్ మార్కెట్ కి వెళ్తారు. ఆ తర్వాత ఇషిక, వీరు కలిసి మాట్లాడుకుంటారు. ఏంటి బ్రో ఇలా అయింది.. అత్తయ్య అంత అన్న కూడా ప్రమీల సూపర్ మార్కెట్ కి వెళ్ళింది.. రుద్ర బావ ఇచ్చిన దైర్యం మాములుగా లేదని వీరు తో ఇషిక అంటుంది. తను వెళ్ళింది కానీ మళ్ళీ అక్కడ ఇబ్బందులు తెలియవు కదా..  నేను ఒక ప్లాన్ చేసానులే అని వీరు అనగానే అదేంటో చెప్పమని ఇషిక అంటుంది. వద్దులే చెప్తే వర్క్ అవుట్ అవట్లేదని వీరు అంటాడు. మరొకవైపు ప్రమీల మేడమ్ వస్తున్నారు అన్నీ సర్దండి అని మక్కమ్ ఎంప్లాయిస్ కి చెప్తాడు. ఆ తర్వాత సూపర్ మార్కెట్ కి ప్రమీలని తీసుకొని రుద్ర, పెద్దసారు వస్తారు.

ప్రమీలకి అన్ని చెప్పమని మక్కమ్ కి చెప్తాడు రుద్ర. ఏదైనా డౌట్ ఉంటే మక్కమ్ ని అడగమని ప్రమీలకి రుద్ర చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రౌడీలని వీరు పిలిచి తను చెప్పినట్లు చెయ్యమని చెప్తాడు. సరే సర్ సూపర్ మార్కెట్ లో ఉన్న అమ్మాయిని టీజ్ చేయ్యాలి అంతే కదా అని రౌడీలు అంటారు. మాములు టీజింగ్ కాదని వీరు చెప్తాడు. దాంతో వాళ్ళు లోపలికి వెళ్తారు. వీరు సూపర్ మార్కెట్ లొని సీసీటీవీ కంట్రోల్ రూమ్ కి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com