
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -611 లో.... జ్యోత్స్నకి డౌట్ వచ్చి డాక్టర్ హారిక దగ్గరికి వెళ్తుంది. డాక్టర్ మిమ్మల్ని కొన్ని డౌట్స్ అడగాలని అంటుంది. ఏంటని హారిక అంటుంది. జ్యోత్స్న ఇండైరెక్ట్ గా అన్ని ప్రశ్నలు అడుగుతుంటే తనకి కౌంటర్ గా హారిక సమాధానం చెప్తుంది. బోన్ న్యూరో ఎవరైనా డొనేట్ చెయ్యొచ్చా అని జ్యోత్స్న అనగానే రక్త సంబందం అయి ఉండాలని హారిక చెప్తుంది. ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే ఇయ్యొచ్చా అని జ్యోత్స్న అనగానే తనకి ఇక్కడ ఏం జరుగుతుందో అంత అర్థం అయిందని డాక్టర్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తన వెనకాలే జ్యోత్స్న కూడా వెళ్తుంది.
మరొకవైపు ఎందుకు బిడ్డని వద్దని అనుకుంటున్నారని కాంచన అడుగగా తల్లి బిడ్డలో ఎవరో ఒకరే బ్రతుకుతారంటే ఏం చేస్తావ్ అమ్మ అని కాంచనని కార్తీక్ అడుగుతాడు. దాంతో అందరు షాక్ అవుతారు. ఎవరో ఒకరు ఎందుకు ఇద్దరు బ్రతకాలని కాంచన అంటుంది. ఇక్కడ బిడ్డ వల్ల తల్లికి సమస్య ఉందని కార్తీక్ చెప్తాడు. ఇదంతా దీప నేను చెప్పింది వినకపోవడం వల్లే.. మా పుట్టింటికి పనికి వెళ్లకని చెప్పానని కాంచన అంటుంది. దాని రాత ఏంటో గానీ ఎప్పుడు ఇలాగే ఇన్నిరోజులు తన తల్లిదండ్రలు ఎవరో తెలియలనుకున్నాను.. కానీ ఇప్పుడు వద్దు తెలిస్తే వాళ్ళ జీవితంలో ఇది ఉంటే వాళ్ళు ఉండరని అనసూయ అంటుంది. దశరథ్ కి కోపం వస్తుంది. మరొకవైపు డాక్టర్ వెనకాలే జ్యోత్స్న వెళ్లి ప్రెగ్నెంట్ వాళ్ళు డోనర్ గా ఉండొచ్చా అని అడుగుతుంది. మీరు ప్రెగ్నెంటా అని డాక్టర్ అంటుంది. లేదని జ్యోత్స్న అనగానే మరెందుకు ఇవన్నీ అడుగుతున్నారు దశరథ్ గారికి కాల్ చేస్తాను. మీరు ఏం అడిగినా తనకి చెప్పమన్నారని హారిక అనగానే వద్దని జ్యోత్స్న భయపడుతుంది. ఆ తర్వాత దశరథ్ కోపంగా దీపని అనేవాళ్ళే గాని దీప గురించి ఆలోచించారా.. ఏ తల్లి అయినా బిడ్డని వదులుకుంటుందా అని దశరథ్ కోప్పడతాడు.
అన్నయ్య నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్లి తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలా చేయమను అని దశరథ్ తో కాంచన అంటుంది. బిడ్డకి ఏదైనా అయితే దీపని జీవితం లో క్షమించనని కాంచన అంటుంది. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య అని దీప అనగానే బిడ్డ నువ్వు జాగ్రత్త అని అంటుంది. దశరథ్ చేతిని దీప చేతిలో పెట్టి నా కోడలు.. నీ కూతురు అనుకో తల్లి బిడ్డని కాపాడమని డాక్టర్ కి చెప్పమని కాంచన అంటుంది. మరొకవైపు దీప, కార్తీక్, దశరథ్ బయటకు వస్తారు. దశరథ్ బాధపడుతుంటే మీరు అందరి గురించి ఆలోచిస్తున్నారు.. మీ భార్య గురించి తప్ప. కొన్నిరోజులుపోయాకా దీప మీ కూతురు అని తెలిసి అసలు నిజం తెలిస్తే అంతా సర్దుకుంటుందని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.







