ఏంటి రోహిణి గారు ప్రేమలో ఏమైనా పడ్డారా?
on Feb 5, 2025
బుల్లితెర మీద జబర్దస్త్ కామెడీ షో ద్వారా లేడీ కమెడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది రౌడీ రోహిణి. రోహిణి ఎక్కడ ఉంటె అక్కడ నవ్వులే నవ్వులు. ఈ మధ్య జబర్దస్త్ లోనే కాదు అన్ని షోస్ లో కనిపిస్తోంది. బలగం మూవీ, సేవ్ ది టైగర్స్ వంటి సినిమాలు, వెబ్ సిరీసులలో టైమింగ్ ఉన్న కామెడీ చేస్తూ నవ్విస్తోంది. ఐతే రోహిణి బిగ్ బాస్ సీజన్ 3 కి వెళ్లి వచ్చింది. అలాగే చాన్నాళ్లకు బిగ్ బాస్ 8 కి కూడా వెళ్లి వచ్చింది. ఐతే ఇంతకుముందు బిగ్ బాస్ కి వెళ్లినా రానంత పేరు ఈ సీజన్ 8 కి బాగా వచ్చింది. దాంతో ఇప్పుడు ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి అవినాష్, హరితో కలిసి వచ్చి మరీ ఎంటర్టైన్ చేస్తోంది.
ఇక ఇప్పుడు రోహిణి బ్లాక్ శారీతో చేసిన ఒక రీల్ ఫుల్ వైరల్ అవుతోంది. అందాల రాముడు మూవీలో ఆర్తి అగర్వాల్ డాన్స్ చేసిన "చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి" అనే సాంగ్ కి అదిరిపోయే డాన్స్ చేసింది. దాంతో నెటిజన్స్ ఫుల్ ఫిదా ఐపోతున్నారు. "బ్లాక్ శారీలో సూపర్ గా ఉన్నారు. ఈ సాంగ్ తో ఆర్తి అగర్వాల్ ని గుర్తు చేశారు. ఏంటి రోహిణి గారు ఈ మధ్య మంచి జోష్ మీద రీల్స్ చేస్తున్నారు ప్రేమలో ఏమైనా పడ్డారా??? ..హాయ్ అక్కా మీ డాన్స్ చాలా బాగుంటుంది. రాక్ స్టార్ రోహిణి..రోహిణి గారు ఎందుకో నాకు కొత్తగా కనిపిస్తున్నారు...ఇంతకు పెళ్ళెప్పుడు...బరువు బాగా తగ్గారు ఎలా..శారీ ఎక్కడ తీసుకున్నారు" అంటూ బోల్డు ప్రశ్నలు అడిగేస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
