Home

»

Tv News

BiggBoss 10 Telugu : రోహిత్ ఫ్యాన్స్ కి శుభవార్త.. రీఎంట్రీ కన్ఫమ్!

Nov 3, 2026 8:45AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 నుంచి రోహిత్ నాయుడు పట్నం ఎలిమినేట్ అయిన తర్వాత ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ ఫ్యాన్స్ కి శుభవార్త అంటూ "ROHITH Re-Entry Soon, ఈ సారి ROHITH RE-LOADED" అనే పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెడ్ బ్యాక్ గ్రౌండ్ లో రోహిత్ గ్లిట్టర్ బ్లేజర్ తో ఉన్న ఈ పోస్టర్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు, రోహిత్ మళ్లీ హౌస్ లోకి వస్తాడన్న ఆశతో ఉన్నారు.

వాస్తవానికి రోహిత్ ఎలిమినేషన్ పై మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. బిగ్ బాస్ టీమ్ అతడికి సీక్రెట్ రూం ఆఫర్ ఇచ్చిందని, కానీ అతడు తిరస్కరించి బయటకు వచ్చాడని వార్తలు వచ్చాయి. మరోవైపు మాజీ విన్నర్ కౌశల్ మండా కూడా ట్రంప్ కార్డ్ లాంటి కంటెస్టెంట్ ను బిగ్ బాస్ అంత ఈజీగా బయటకు పంపించడని అనడంతో రీ-ఎంట్రీపై ఊహాగానాలు మరింత పెరిగాయి.

ఈ రీ-ఎంట్రీ పోస్టర్ అధికారికంగా బిగ్ బాస్ టీమ్ నుంచి వచ్చింది కాదు, ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని తెలుస్తోంది. అయినా కూడా రోహిత్ కు ఉన్న క్రేజ్ కారణంగా ఈ పోస్ట్ వేగంగా వైరల్ అవుతోంది. అగ్నిపరీక్ష నుంచి వచ్చి సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇచ్చిన రోహిత్ కు బయట విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

బిగ్ బాస్ హిస్టరీలో గతంలో చాలామందికి రీ-ఎంట్రీ ఇచ్చారు కాబట్టి రోహిత్ విషయంలో కూడా అదే జరుగుతుందని ఫ్యాన్స్ గట్టిగా ఆశిస్తున్నారు. ఒకవేళ రోహిత్ నిజంగానే రీ-ఎంట్రీ ఇస్తే ఈ సారి RE-LOADED వెర్షన్ లో మరింత దూకుడుగా ఆడతాడని అభిమానులు నమ్ముతున్నారు. అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com