
బిగ్ బాస్ తెలుగు సీజన్-10 తొమ్మిదో వారం నామినేషన్స్ హీటెక్కించాయి. ఈసారి హౌస్ రెండు బ్యాచ్ లుగా విడిపోయి ఒకరిపై ఒకరు నిప్పులు చెరిగారు. ముఖేష్, వర్షిణి, సుధీర్ ఒక వైపు.. రాంప్రసాద్, వంశీ, త్రిగుణ్ మరోవైపు బ్యాచ్ లుగా ఏర్పడి మాటల యుద్ధం మొదలుపెట్టారు.
తొమ్మిదో వారం నామినేషన్స్ లో హైలైట్ వంశీ Vs ముఖేష్ ఫైట్. ముఖేష్ వంశీని నామినేట్ చేయగా, వంశీ కూడా ముఖేష్ ను నామినేట్ చేసి గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. ఇద్దరి మధ్య మాటలు తీవ్రస్థాయికి చేరాయి. ఎవరో ఒక వ్యక్తి ఒక రాడ్ తీసుకొని అలా చేయాలి.. అని అనడం.. ఇలాంటి అసభ్యకరమైన మాటలు నీ నోటి నుండి వస్తాయని అస్సలు ఊహించలేదు.. ఝాన్సీ మిమ్మల్ని నమ్మి మీతో ఉన్నప్పుడు.. మీరు అలాంటి వర్డ్స్ మాట్లాడారు. మొన్న హోస్ట్ సర్ మీతో పాటు ఆమెను కూడా నిల్చోబెట్టారు. మీ వల్ల ఆ అమ్మాయికి ఎంతో ఎఫెక్ట్ అయి ఉంటుంది. ఆమె నిన్ను అన్నయ్య అని పిలిచింది.. మీరు కరెక్ట్ గా ఉంటే హౌస్ నుండి బయటకి వెళ్ళేది కాదు ఇక్కడే ఉండేదని ముఖేష్ పై వంశీ ఫైర్ అయ్యాడు. ఇక తన సెకెండ్ నామినేషన్ ని వర్షిణిని చేశాడు వంశీ. ఫస్ట్ వీక్ లో తెలుసుకున్న ఒక విషయం.. తనని ఇప్పటివరకు ఒక్కసారి కూడా నామినేషన్ చేయలేదని వర్షిణితో వంశీ చెప్తాడు. మధ్యలో ముఖేష్ మాట్లాడుతుంటాడు. మధ్యలో మీరెందుకు మాట్లాడుతున్నారని వంశీ పైర్ అవుతాడు. వర్షిణి ప్రాపర్ గా డిఫెండ్ చేసుకోలేకపోయింది. ఇందులో వంశీ నామినేషన్ వ్యాలిడ్ గా ఉంది.
మరోవైపు నీతూ వర్సెస్ ఆర్కే మధ్య కూడా వాగ్వాదం జరిగింది. తనకు సరైన కారణాలు చెప్పకుండా రెండుసార్లు ఎగ్జిట్ ఇచ్చారని ఆర్కే నీతూను ప్రశ్నించగా చిన్న విషయానికే అంత గట్టిగా మాట్లాడొద్దని నీతూ బదులిచ్చింది. ముఖేష్ దూకుడుపై శ్వేత ఫైర్ అయింది. టాస్కుల్లో ముఖేష్ అతిగా దూకుడుగా వ్యవహరిస్తున్నాడని, బంతిని పట్టుకునే క్రమంలో కొట్టడానికి వచ్చినట్లు ముందుకు వస్తున్నాడని ఆరోపించింది. దానికి ముఖేష్ కౌంటర్ గా తాను తీసుకొచ్చిన బంతిని పట్టుకుని వేరే వాళ్లు పరుగెత్తారని వివరణ ఇచ్చాడు. శివ కూడా టాస్క్ లో తను చేసిన పనులను ముఖేష్ చెప్పడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు. మొత్తంగా 9వ వారం నామినేషన్స్ తో హౌస్ లో గ్రూప్ గేమ్ మరింత రచ్చకెక్కింది. ఈ వారం ఎవరు నామినేషన్స్ లోకి వస్తారో, ఎలిమినేషన్ ఎలా ఉంటుందో చూడాలి.






