Home

»

Tv News

అల్లు అర్జున్‌‌ డ్యాన్స్‌పై రాధికా శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్!

Mar 27, 2026

ఆట షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ప్రీతీ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్  మాత్రమే ఈ ప్రోమోలో కనిపించింది. పుష్ప 2 లో అమ్మోరి జాతర సాంగ్ కి బన్నీ పూనకం వచ్చినట్టు ఎలా నాట్యం చేసాడో సినిమాలో అందరికీ తెలుసు. ఆ సాంగ్ బాగా వైరల్ అయింది. ఇప్పుడు ఈ షోలో కూడా ప్రీతీ కూడా బన్నీకి తీసికట్టుగా పూనకమొచ్చినట్టు ఆడింది. దాంతో జడ్జెస్ రాధికా, రఘు మాష్టర్, నిహారికా ముగ్గురు కూడా ఫిదా ఇపోయారు. అప్పుడు రాధికా ఒక ఇంటరెస్టింగ్ విషయాన్ని చెప్పారు.

"బన్నీ అంత మంచి డాన్సర్ అవడానికి కారణం నేనే" అన్నారు. దాంతో నిహారిక "ఎందుకు రాధికా గారు " అని అడిగింది. "అల్లు అరవింద్ గారు ఒక పిక్చర్ ని ప్రొడ్యూస్ చేశారు. అందులో అబ్బాయిని ఎత్తుకుని నేను రైల్వే ట్రాక్ మీద పరిగెత్తాలి. అప్పటికి ఎవరూ లేరు. బన్నీ మాత్రమే షూటింగ్ టైములో ఉన్నాడు." అని చెప్పారు. "మా బన్నీ గారిని ఎత్తుకుని మీరు రైల్వే ట్రాక్ మీద పరిగెట్టారా " అని సుధీర్ ఆశ్చర్యపోతూ అడిగాడు. "అవును అప్పుడే నేను బన్నీకి డాన్స్ ఎలా చేయాలో నేర్పించాను " అని చెప్పారు రాధికా శరత్ కుమార్. దాంతో అందరూ నవ్వేశారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com