
సర్కార్ షో ప్రతీ వారం లాగే ఈ వారం కూడా అలరించింది. ఇందులో క్రికెట్ కామెంటేటర్లు వచ్చారు. అందులో ముఖ్యంగా సీనియర్ మోస్ట్ ఎం ఎస్ కె ప్రసాద్ వచ్చి చాలా విషయాలను షేర్ చేసుకున్నారు. విరాట్ కోహ్లీ గురించి చెప్పిన విషయాలు ఎంతో ఇన్స్పిరేషన్ గా అనిపించింది. "ఈ కథ ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి. 2013 లో విరాట్ కోహ్లీ కెరీర్ చాలా డౌన్ ఫాల్ లో ఉంది. అతను ఒక పార్టీ గై, ఇష్టమొచ్చినట్టు టైం పాస్ చేసేవాడు. మ్యాచ్ గెలిచినా ఓడినా అర్ధరాత్రి 2 వరకు పార్టీలు చేసుకుంటూనే ఉండేవాడు. పంజాబీస్ గురించి తెలిసిందేగా పార్టీ చేసుకోవడానికి ఒక సందర్భం కావాలి. రంజీ ట్రోఫీ మ్యాచ్ లో కళ్యాణ్ అవుట్ చేసాడు 2006 - 2007 లో మా మీద రంజీ ట్రోఫీ ఆడాడు విజయవాడలో . మాకు కెరీర్ స్టార్టింగ్. 2016 లో నేను సెలెక్టర్ ని ఐనప్పుడు విరాట్ కోహ్లీ బాగా తగ్గిపోయి కనిపించాడు. అప్పటి వరకు ఏంటి విరాట్ ఇలా ఉన్నవేంటి అని అడిగాను.. అన్నా సాయంత్రం వచ్చి మాట్లాడతాను అన్నాడు. ఆరోజు వచ్చి నాతో మాట్లాడాడు. విరాట్ చెప్పిన టైం కంటే ముందే అక్కడ ఉంటాడు. మేము ఆడేటప్పుడు పెద్ద పొట్టతో ఉండేవాడివి కదా ఇలా ఇపోయావ్ ఏంటి అని అడిగాను.
2013 లో తనను టీమ్ నుంచి తీసేసే పరిస్థితి వచ్చింది. ధోని అంటే అంత రెస్పెక్ట్ ఎందుకు అంటే అతన్ని అందరూ తీసేయాలని చెప్పినా అతను తీసేయలేదు. విరాట్ తో ఫ్యూచర్ ఉంది అని చెప్పాడు. తర్వాత అతను ఒక మ్యాచ్ ఆడితే 40 ఓవర్లు లో 170 రన్స్ చేసాడు. అప్పుడు రవి శాస్త్రి తన కామెంటరీలో ఒక మాట అన్నాడు. ఆస్ట్రేలియా గడ్డ మీద ఇలాంటి ఇన్నింగ్ ని ఇంతవరకు ఎవరూ చేయలేదు అని. ఆ మాటలు విరాట్ మనసు మీద బాగా ప్రభావం చూపించాయి. తర్వాత అంతా పార్టీ అది సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈరోజు పార్టీ వద్దు అని తనకు తానూ ఎనాలిసిస్ చేసుకున్నాడట. భారతదేశ చరిత్రలో రవి శాస్త్రి నా ఇన్నింగ్ ని బెస్ట్ అని చెప్పాడు. బహుశా ఇలాంటి ఇన్నింగ్స్ ఇంకా నేను ఎక్కువగా చేస్తే లెజెండరీ ప్లేయర్ గా మారే అవకాశం ఉంది కదా. అప్పుడు అద్దం ముందు షర్ట్ విప్పేసి ఈ పెర్సొనాలిటీతో నేను గెలవగలనా అని అప్పటి నుంచి బెస్ట్ బ్యాట్స్ మెన్ అవ్వాలి అనుకున్నాడట. ఇప్పుడు ఉన్నవారందరికంటే బెస్ట్ గా వెళ్ళాలి అంటే ఫిట్ నెస్ అనుకుని దాని మీద కాన్సంట్రేషన్ మొదలుపెట్టాడో అప్పుడు గేమ్ కూడా మెరుగయ్యింది. 2015 - 16 నాటికి 28 % ఫాట్ ఉన్న బాడీని 14 % కి నెమ్మదిగా తగ్గించుకుంటూ వచ్చాడు. 2022 కి ప్రపంచంలోనే బెస్ట్ బ్యాట్స్ మెన్ అయ్యాడు. ఇది చెప్పేసరికి గూస్ బంప్స్ వచ్చాయి. ఆరేళ్ళు గోధుమ, మైదా వంటకాలు తినకుండా తన సొంతంగా తానే వండుకునేవాడు. జంక్ ఫుడ్ పూర్తిగా మానేసాడు. 2018 - 19 కి ఈ ప్లానెట్ లోనే బెస్ట్ స్పోర్ట్స్ మెన్ అవ్వాలి అనుకున్నాడు. అయ్యాడు. విరాట్ కోహ్లీ కెరీర్ జర్నీ చాలా డిఫరెంట్ " అని చెప్పుకొచ్చారు ఎంఎస్కె. ప్రసాద్.






