Home

»

Tv News

Podharillu :మహా నిర్ణయంతో ఇంట్లో పండగ వాతావరణం.. శైలు సరికొత్త నాటకం!

Mar 26, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -78 లో....మహా ఇంట్లో అందరికి నిజం చెప్తుంది. ఇక నా దారి నేను చూసుకుంటానని మహా అనగానే అవసరం లేదు ఈ ఇంటి బిడ్డగా ఇంట్లోనే ఉండు.. నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో చెయ్.. అందరం నీకు సపోర్ట్ గా ఉంటాం.. అంతేగానీ ఇంకా నీకు జాబ్ కూడా రాలేదు.. ఎలా వెళ్తావ్ ఏం చేస్తావని పెద్ది అంటాడు. మహా ఏదో చెప్పబోతుంటే నువ్వు ఏం మాట్లాడకని మాధవ అంటాడు.  ఉంటానని కూడా చెప్పొద్దా అని మహా అనగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు.

నిన్ను వదిన అనే పిలుస్తానని కన్నా అనగానే ఇదంతా నీ వల్లేరా అని మహా అంటుంది. మహా వెళ్ళిపోతుందని నారాయణ బీడీ కాలుస్తూ ముగ్గుపై వేస్తాడు. అలా ఎందుకు వేస్తున్నారని మహా అడుగుతుంది‌. వేస్తే ఏంటి ఇక ఇలా ముగ్గు వెయ్యడానికి ఎవరు ఉండరు కదా అని నారాయణ అనగానే నేను ఇంట్లోనే ఉంటున్నానని మహా చెప్పగానే నారాయణ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు మహా ఇంట్లో ఉంటుందని కేశవ, చక్రి, కన్న ముగ్గురు డాన్స్ చేస్తారు. మరొకవైపు శైలు తన ఫోన్ తన దగ్గర లేకపోవడంతో తను రీల్స్ చెయ్యకపోతే ఫాలోవర్స్ తగ్గుతారని ఫీల్ అవుతుంది. వాళ్ళ నాన్న ఫోన్ నుండి తన ఫోన్ కి కాల్ చేస్తుంది శైలు. అదే సమయంలో కేశవ తన ఫోన్ ని ఇంట్లో మర్చిపోతాడు.  శైలు ఫోన్ లో వాళ్ళ నాన్న నెంబర్ మై లవ్ అని సేవ్ చేసి ఉంటుంది. ఫోన్ రావడంతో కన్నా మహా చూస్తారు. మై లవ్ అని ఉండడంతో కేశవ లవర్ అని అనుకుంటారు.

శైలు ఫోన్ చేయగా మహా లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. కేశవని ఇంట్లో ఇరికించాలని కేశవ లవర్ అన్నట్లు మాట్లాడుతుంది శైలు. ఆ తర్వాత కేశవ ఫోన్ మర్చిపోయానని గుర్తువచ్చి ఇంటికి వస్తాడు. కేశవ వచ్చేలోపు మహా కాల్ హిస్టరీ డిలీట్ చేస్తుంది. హమ్మయ్య ఆ శైలు అయితే ఫోన్ చెయ్యలేదనుకుంటాడు. ఎందుకు అయినా మంచిదని శైలుకి ఫోన్ చేసి కేశవ మాట్లాడుతుంటే చాటు నుండి కన్నా, మహా వింటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com