.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -170 లో..... శైలుకి కేశవ నచ్చజెప్పుతాడు. మా అన్నయ్య పెళ్లి అయ్యాక చేసుకుందామని అంటాడు. దానికి శైలు ఒప్పుకుంటుంది. హాస్టల్ లో ఉండమని కేశవ చెప్తాడు. లేదు మా ఇంటికి వెళ్తానని శైలు అంటుంది. నాకు చాలా హ్యాపీగా ఉందిరా ఇన్ని రోజులకి మనసు విప్పి మాట్లాడావని శైలు అంటుంది. మరి నీతో మాట్లాడాలంటే ఎలా అని శైలు అనగానే సరే ఫోన్ కొంటానని కేశవ అంటాడు.
మరొకవైపు అసలు ఏం జరిగిందో ఇంకా ఇంటికి రావడం లేదని మాధవ వాళ్ళు టెన్షన్ పడుతారు. ఆ తర్వాత శైలుని మొబైల్ షాప్ కి తీసుకొని వెళ్లి ఫోన్, సిమ్ తీసుకుంటాడు. ఆ తర్వాత తనని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు. అప్పటికే శంకర్ కి ఫోన్ ల మీద ఫోన్ లు వస్తుంటాయి. మీ కూతురు లేచిపోయింది అంట కదా అని అంతలోనే శైలుని తీసుకొని కేశవ వస్తాడు. అక్కడున్న వాళ్లతో నేనేం లేచిపోలేదు నా బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళానని శైలు చెప్తుంది. అందరిని పంపిస్తుంది ఎవరైనా శైలుని ఏమైనా అంటే వాళ్ళ సంగతి చెప్తానని కేశవ వార్నింగ్ ఇస్తాడుమ ఆ తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చావే అని శైలుని వరాలు కోప్పడుతుంది. ఈ ఇల్లు నాది అని శైలు అంటుంది. కట్నం తెస్తే గానీ పెళ్లి చేసుకోనని అన్నాడా అని వరాలు అనగానే వాళ్ళ గురించి నీకేం తెలుసు వాళ్ళు మన కుటుంబం గురించి అలోచించి పంపించారని శైలు చెప్తుంది. మరొకవైపు కేశవ ఒక్కడే ఇంటికి వెళ్తాడు. అమ్మాయి ఎక్కడ అని మాధవ అడుగుతాడు. వాళ్ళ ఇంట్లో దింపేసి వచ్చానని కేశవ అనగానే చక్రి కోప్పడతాడు. తనకి ఫోన్ ఇచ్చాను.. మేం ఇద్దరం మాట్లాడుకొని నిర్ణయం తీసుకున్నామని కేశవ చెప్తాడు.
కేశవ దైర్యంగా ఉన్నాడంటే మనం టెన్షన్ పడనవసరం లేదని మహా అంటుంది. ఆ తర్వాత చక్రి దగ్గరికి కేశవ వస్తాడు. ఎందుకు రా ఇలా చేసావని చక్రి అడుగుతాడు. అన్నయ్య కోసం అని కేశవ చెప్పగానే బాగా ఆలోచించావని చక్రి అంటాడు. అప్పుడే మహా వచ్చి చాలా బాధ్యతగా ఆలోచించాడని అంటుంది వాడి కారణం వేరే ఉంది అని చక్రి అనగానే పెద్ది గురించే కదా చాలా గొప్పగా ఆలోచించాడు అని మహా అంటుంది. మరొకవైపు శైలుని ఇంట్లో వాళ్ళు కొడుతున్నారని పోలీసులకి కంప్లైంట్ ఇస్తుంది. దాంతో వాళ్ళు ఇంటికి వస్తారు. తరువాయి భాగంలో మాధవకి సంబంధం వస్తుంది. పంతులు మాధవ జాతకం చూసి మాధవ ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే తన జీవితం బాగుంటుందని చెప్తాడు. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
