.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -71 లో....కోర్ట్ స్టే ఆర్డర్ చూస్తూ సింహాద్రి కోపంతో రగిలిపోతుంటాడు. ఎవరేం చేసినా ఆ తోట నాదే అని సింహాద్రి అంటాడు. మరొకవైపు భువనకి జానూని ప్రేమిస్తున్న విషయం సూర్య చెప్పాలని అనుకుంటాడు. భువన వెళ్తుంటే అమ్మా నీతో మాట్లాడాలి.. టైమ్ ఇస్తావా అని అడుగుతాడు. నీకు టైమ్ ఇచ్చిన నాతో మాట్లాడే టైమ్ నువ్వు ఇవ్వవు కదా.. ఎప్పుడు ఆ జాను అంటూ తిరుగుతావ్ కదా అని భువన అంటుంది.
అసలు మావయ్య చేసింది తప్పు అమ్మ అని సూర్య అనగానే ఇదే విషయం వేరే వాళ్ళు అంటే వాళ్ళ చెంపపగులగొట్టేదాన్ని అని నువ్వు జాను ఫ్యామిలీ మాయలో ఉన్నావని భువన కోప్పడుతుంది. అమ్మ నీతో ఒకటి చెప్పాలని సూర్య అనగానే నిత్యతో పెళ్లి అయ్యేవరకు నువ్వు చెప్పింది నేను వినను అని భువన అంటుంది. రేయ్ తుఫాన్ జానూ సూర్య మాట్లాడుకోకుండా నువ్వే చూసుకోవాలని భువన అంటుంది. ఆ తర్వాత మురళి అసిస్టెంట్ బాబిన్ కస్టమర్స్ ని మురళి దగ్గరికి తీసుకొని వెళ్తాడు. మా అమ్మాయి అచ్చం నందులాగా ఉంటుంది. తన కొలతలు తీసుకోమని కస్టమర్ అంటుంది. దొరికింది మంచి ఛాన్స్ అని పెద్దావిడ రేయ్ నందు దగ్గర కొలతలు తీసుకోమని చెప్తుంది. మురళి కొలతలు తీసుకుంటు నందు కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాడు. ఇదంతా కావాలనే చేస్తున్నారు కదా అని నందు అంటుంది.
ఆ తర్వాత గౌతమి కాలేజీకి వెళ్తుంది. కార్తీక్ ని పట్టించుకోకుండా వెళ్తుంది. ఏంటి గౌతమి పెదవాళ్ళు గొడవ పెట్టుకుంటే మనకి ఏంటని కార్తీక్ అంటాడు. నేను నిన్న మీ నాన్నకి సపోర్ట్ చేస్తే ఇంట్లో తిట్టారని గౌతమి అంటుంది నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే మా తోట డాక్యుమెంట్స్ తీసుకొనిరా అని కార్తీక్ కి గౌతమి చెప్తుంది. ఆ తర్వాత కార్తీక్ తన ఫ్రెండ్స్ తో డ్రింక్ చేస్తూ ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. ఆ తర్వాత జానూని సర్ ప్రైజ్ అంటూ సూర్య బయటకు తీసుకొని వెళ్తాడు. తరువాయి భాగంలో జానూకి సూర్య రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. జాను ఒప్పుకొని తనని హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
