Home

»

Tv News

Podharillu : పెళ్లిచూపులను అడ్డుకున్న మహా, చక్రి.. షాకింగ్ ట్విస్ట్‌తో శైలు మాస్టర్ ప్లాన్!

Jul 30, 2026 9:59AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -168 లో......శైలు తన ఫ్రెండ్ కీర్తి ఫోన్ నుంచి కేశవకు ఫోన్ చేసి నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేసారు.. ఎలాగైనా ఆపమని శైలు చెప్తుంది. అప్పుడే వరాలు రావడంతో ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత చక్రి దగ్గరికి కేశవ వచ్చి శైలుకి పెళ్లి చూపులు అంటరా.. ఎలాగైనా ఆపాలని అంటాడు. అప్పుడే మహా వస్తుంది. మహాకి కూడా విషయం చెప్తారు.

ఎలాగైనా పెళ్లి చూపులు ఆపాలని మహా చక్రి బయటకు వస్తారు. వాళ్ళ ఇంటికి దగ్గరలో ఆగి పెళ్లిచూపులకి వచ్చేవాళ్ళని ఆపి మీరు పెళ్లిచూపులకి వెళ్తున్న అమ్మయి, మా  తమ్ముడు ప్రేమించుకున్నారని చక్రి చెప్తాడు. దాంతో వాళ్ళు వెనక్కి వెళ్తారు. అసలు శైలు ఇంటికే అని కన్ఫమ్ చేసుకోకుండ అలా అన్నావేంటని మహా అంటుంది. ఒక గల్లీలో ఒక రోజు ఒక్కరికే జరుగుతాయి.. వాళ్ళ ఇంటికి వెళ్ళేది వీళ్ళే అని చక్రి అంటాడు. ఆ తర్వాత మహా, చక్రి ఇద్దరు కేశవ దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత శైలుని చూడడానికి అబ్బాయి వాళ్ళు వెళ్తారు. ఆ విషయం కేశవకి శైలు ఫోన్ చేసి చెప్తుంది. అంటే మీరు ఆపింది వేరేవాళ్ళనా అని కేశవ అంటాడు. అప్పటికే చెప్తున్నానని అని మహా కోప్పడుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఎవడ్రా నా కూతురు పెళ్లిచూపులు ఆపి నా కూతురిని ప్రేమిస్తుందని చెప్పింది ఎవరని పెళ్లిచూపులు క్యాన్సిల్ అయిన అమ్మాయి తండ్రి వస్తాడు. తప్పు అయింది అండి.. శైలు పెళ్లిచూపులు కూడా ఈ రోజే కదా కన్ఫ్యూషన్ అయ్యామని చెప్పి మహా వాళ్ళని పంపిచేస్తుంది.

ఆ తర్వాత శైలు వాళ్ళ ఇంటికి పెళ్లిచూపులకి వస్తారు. శైలు అందంగా రెడీ అవుతుంది. దాంతో వరాలు షాక్ అవుతుంది. అబ్బాయితో పర్సనల్ గా మాట్లాడాలని శైలు అతన్ని పక్కకి తీసుకొని వెళ్లి తన ప్రేమ విషయం చెప్తుంది. ఆ తర్వాత అబ్బాయి వచ్చి నేను ఈ పెళ్లి చేసుకోను.. ఆ అమ్మాయి ఎవరినో ఇష్టపడుతుందని అతను అంటాడు. వాళ్ళు వెళ్ళాక ఎందుకు ఇలా చేస్తున్నావని శైలుని వరాలు తిడుతుంది. తరువాయి భాగంలో శైలు బ్యాగ్ తీసుకొని కేశవ దగ్గరికి వస్తుంది. ఇక శైలు కేశవకి పెళ్లి చెయ్యాలని ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com