.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -536 లో..... సేనాపతిని ధీరజ్ కొట్టబోతుంటే ప్రేమ ఆపి ధీరజ్ ని కొడుతుంది. నన్నే కొడుతావా అని ప్రేమని ధీరజ్ కొట్టబోతు ఆగిపోతాడు. ఏంటే భర్తపై చెయ్ చేసుకున్నావని ప్రేమతో రేవతి అంటుంది. నలుగురిలో భార్యని నిర్దోశిగా నిలబెట్టాడు. నా గురించి అందరికి తెలిస్తే నేను తలెత్తుకోలేను ఈ విషయం ఎవరికి చెప్పొద్దని మాట తీసుకున్నా.. అయిన చెప్పావంటే ఏమనుకోవాలి ప్రాణం కంటే ఎక్కవ ప్రేమించానురా కానీ ఐ హేట్ యు అని ప్రేమ అంటుంది.
కళ్ళలో పెట్టుకొని చూసుకున్నా కానీ మీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావ్.. ఐ హేట్ యు అని ధీరజ్ అంటాడు. వాడితో మాటలు ఏంటి నా కూతురిని నా ఇంటికి తీసుకొని వెళ్తాను.. పదా ప్రేమ అని సేనాపతి అనగానే వద్దని వేదవతి రిక్వెస్ట్ చేస్తుంది. తీసుకొని వెళ్లిపోండి అని ధీరజ్ అనగానే అందరు షాక్ అవుతారు. ప్రేమని తీసుకొని సేనాపతి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శ్రీవల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళ కాపురం కూడా పాడు చెయ్యాలని వల్లి అనుకొని అంటే ఇన్ని రోజులు ఈ విషయం మా దగ్గర దాచారని వల్లి అనగానే అదేం లేదు మావయ్య మీరు బాధపడుతారని నర్మద అంటుంటే నువ్వు మాట్లాడకు నా దగ్గర కూడా నిజం దాచావని సాగర్ కోప్పడుతుంటే నువ్వు తనని ఏం అనకురా తప్పు అంతా నాదే అని వేదవతి అంటుంది.
ఆ తర్వాత ఇంత పెద్ద విషయం దాచావ్.. వాళ్ళు ఏం అంటున్నారో విన్నావా.. మీకు ఎంత విలువ ఉందో అంటున్నారని రామరాజు కోప్పడుతాడు. వల్లి ఇంకా గొడవ పెద్దది చెయ్యాలని చూస్తుంటే వేదవతి తనని కొడుతుంది. దాంతో వేదవతిని రామరాజు కొట్టబోయి ఆగిపోతాడు. కొట్టాల్సింది తనని కాదు నిన్ను అని రామరాజు అంటాడు. వేదవతి ఏడుస్తూ జరిగింది చెప్తుంది. అమ్మ ప్రేమ గురించి అలోచించి ఇలా చేసిందని చందు అంటాడు కానీ ఇప్పుడు చిన్నోడి జీవితం అని రామరాజు అనగానే నేను ప్రేమతో మాట్లాడుతా అని వేదవతి అనగానే నీతో నేను జీవితంలో మాట్లాడానని రామరాజు కోపంగా వెళ్తాడు. దాంతో వేదవతి ఏడుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
