.webp)
ఢీ షో అంటే కంటెస్టెంట్స్ అంత ఒక వైపు ఉంటారు పండు ఒక్కడే ఒక వైపు ఉంటాడు. ఎందుకంటే అందరూ జస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తారు పండు పెర్ఫార్మెన్స్+ స్కిట్ + కామెడీ + ఎక్స్ప్రెషన్స్ వాట్ నాట్ అనే టైపులో చేసి ఆడియన్స్ తో కడుపుబ్బా నవ్విస్తాడు. ఇక నెక్స్ట్ వీక్ షో ప్రోమో చూస్తే పండు అనకుండా ఉండలేరు. పండు గెటప్ తో పడేసాడు బిన్నీ మాష్టర్ ని. "చికు చికు బండి దానికి దూకుడెక్కువండి ..ఖిలా ఖిలా ఖిలా ఖిలాడీ నేను ప్రేమించిన పిల్ల మరీ ఖిలాడీ " అనే సాంగ్ కి డాన్స్ చేసాడు. "ఈ సీజన్ లో ఇటుక ఇటుక మీద సాంగ్ గుర్తుంది . ఇప్పుడు జనాలు అది మర్చిపోతారు పండు. బ్లాక్ బస్టర్ అవుతుంది ఈ సాంగ్ " అంటూ బిన్నీ మాష్టర్ చెప్పేసాడు.
"రిచ్చెస్ట్ చిల్లర గై ఈజ్ బ్యాక్ " అంటూ పండు తన మీద తానే కామెంట్ చేసుకున్నాడు. ఇక పండుతో పాటు స్టేజి మొత్తం ఊగిపోయింది. ప్రతీ ఒక్కళ్ళూ వచ్చి పండుతో కలిసి డాన్స్ చేశారు. ఇక బిన్నీ మాష్టర్ ఐతే ఓజి పెర్ఫెర్మెన్స్ అని చెప్పేసాడు. పండు పెర్ఫార్మెన్స్ కి నెటిజన్స్ చేస్తున్న కామెంట్స్ " మా అమ్మ వండిన పప్పులో ఉప్పు లేదు పండు అన్నకి తిరుగు లేదు జై పండన్న... పండు అన్న ఇచ్చి పడేసాడు. మా ఆడియన్స్ కి పండు ఒక్కడే 100 టైటిల్స్ తో సమానం ...పండు దుమ్ము లేపావు" అంటూ వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటున్నారు.







